Read News in Telugu Language
adsdaksha

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి నామినేషన్..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 4

– పొంగులేటి తరఫున పత్రాలు దాఖలు చేసిన సోదరుడు ప్రసాద్ రెడ్డి..

Hospital

పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( ponguleti srinivas reddy ) తరఫున ఆయన సోదరుడు పొoగులేటి ప్రసాద్ రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నిoగ్ అధికారి రాజేశ్వరికి ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ ప్రతులు అందజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, జిల్లా నాయకులు బైరు హరినాథబాబు, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బొడ్డు బొందయ్య, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడిత్యా పెట్రామ్ నాయక్ ఉన్నారు.

9న శీనన్న దాఖలు..
ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేశాక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. పాలేరు ప్రజలు శీనన్నను భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 9వ తేదీన పొంగులేటి శీనన్న పాలేరు ఎన్నికల కార్యాలయానికి వచ్చి స్వయంగా తన నామినేషన్ దాఖలు చేస్తారని ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.