Read News in Telugu Language
adsdaksha

ఇందిరమ్మ రాజ్యంలో ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కారం..!

దక్షన్యూస్, ఖమ్మం: నవంబర్ 6

– పాలేరు నియోజకవర్గ ప్రజలకు ఇది నా హామీ : పొంగులేటి

ఇందిరమ్మ రాజ్యం లో ఎక్కడ సమస్యలు అక్కడే అప్పటికప్పుడే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivas reddy ) అన్నారు. సోమవారం తిరుమలాయపాలెం ( thirumalayapalem ) మండల ఎన్నికల ప్రచారంలో పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాలేరు ( paleru ) నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఆశీస్సులు, దీవెనలు అందించి గెలిపించండి అని కోరారు. నేను గెలిచి.. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చాక… మీ వద్దకే అధికారులను పిలిపిస్తా…. అక్కడికక్కడే మీరు ఎదుర్కొంటున్న సమస్యలను… న్యాయబద్ధమైన మీ కోరికలను పరిష్కారం చేయిస్తానని పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు.

తిరుమలాయపాలెం మండలంలోని రావిచెట్టు తండా, పడమటి తండా, హైదర్ సాయి పేట, జల్లేపల్లి తదితర గ్రామాల్లో పొంగులేటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అభివాదం చేస్తూ … కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను వివరిస్తూ… ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. ఎన్నికల పర్యటనకు విచ్చేసిన పొంగులేటికి ప్రతి గ్రామంలోనూ ఘనస్వాగతం లభించింది. ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంలో పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక బాగుపడింది ఒక కల్వకుంట్ల కుటుంబం మాత్రమేనని విమర్శించారు. ఆ కుటుంబానికి వారి బంధువులకు మాత్రమే న్యాయం చేకూరిందని ఆరోపించారు. కొడుకు, కూతురు, అల్లుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సన్నిహితులే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగారన్నారు. అవినీతి బీఆర్ఎస్ ను ఇంటికి సాగనంపి… మీ సమస్యలన్నింటికీ మోక్షం కలిగించే ఇందిరమ్మ రాజ్యనికి ప్రజలంతా ఓట్లు వేసి దీవించాలని కోరారు.

Hospital

read also : బుగ్గవాగు ప్రాజెక్టుకోసం మంజూరు చేసిన రూ. 30 కోట్లు ఏమయ్యాయో..

గెలిచాక కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో పాటు ఇంకా అనేక రకాల పథకాలను ప్రజల దరిచేరుస్తామని హామీ ఇచ్చారు. పాలేరు నియోజకవర్గ అభివృద్ధి కూడా కాంగ్రెస్ హాయంలోనే జరిగిందనే విషయాన్ని మరోమారు గుర్తు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పలువురు బీఆర్ఎస్ పార్టీ, ఇతర పార్టీలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పొంగులేటితో పాటు మద్దినేని బేబి స్వర్ణకుమారి, రాయల నాగేశ్వరరావు, రాంరెడ్డి చరణ్ రెడ్డి, బెల్లం శ్రీను, రామసహాయం నరేష్ రెడ్డి, చావా శివరామకృష్ణ, కొప్పుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

read also : ఖమ్మం కలెక్టర్ అధ్వర్యంలో సరిహద్దు రాష్ట్రాల అధికారుల సమావేశం..

100కు పైగా కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక ..

కూసుమంచి మండలంలోని గైగోళ్లపల్లి, చింతలతండా గ్రామాలకు చెందిన 100కు పైగా కుటుంబాలు బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. వీరికి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఈ సందర్భంగా చేరిన వారికి పొంగులేటి హామీ ఇచ్చారు. వీరంతా మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.

Leave A Reply

Your email address will not be published.