Read News in Telugu Language
adsdaksha

అరచేతిని అడ్డంపెట్టి సూర్యకాంతిని … దాడులతో కాంగ్రెస్ గెలుపును ఆపలేరు… దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 9

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 9

దాడులు కాదు.. జైళ్లో పెట్టినా కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరుతాం..

– విలేకరులతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి..

అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని, ఐటీ ఈడీ దాడులు .. బెదిరింపులతో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేరని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్, పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivas reddy ) అన్నారు. గురువారం పొంగులేటి నామినేషన్ కు సిద్దమవుతున్నసమయంలో ఖమ్మం ( khammam ) నగరంలోని పొంగులేటి నివాసంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. విధి నిర్వహణలో బాగంగా వారు అడిగిన వివరాలను పొంగులేటి వారికి అందజేశారు. నామినేషన్ సమయం సమీపిస్తుండడంతో ఐటి అధికారులు నామినేషన్ వేసి వచ్చేందుకు పొంగులేటికి అనుమతి ఇచ్చారు. అనంతరం ఇంటిబయటికి వచ్చిన శ్రీనివాసరెడ్డిని విలేకరులు సోదాల గురించి ప్రశ్నించగా, ఈ దాడుల గురించి తనకు ముందే తెలుసని గత రెండు రోజుల క్రితమే నేను  ప్రస్తావించానని పొంగులేటి అన్నారు.

అరచేతిని అడ్డంపెట్టి సూర్యకాంతిని.. ఐటి దాడులతో కాంగ్రెస్ గెలుపును ఆపలేరని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. రాబోయే 30వ తేదిన కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎన్ని కుప్పిగంతులు వేసినా ఎవ్వరూ ఆపలేరన్నారు.

read also : 25 రోజులు కష్టపడితే వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే…

Hospital

పదవి ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా..ప్రజల ముందుకు వెళ్తున్నానన్నారు. ఈ రోజు వేకువనే ప్రజలను కలవడానికి సిద్దం అవుతుండగా, ఉదయం గం.5.5ని. 15 ఐటి అధికారులు, 10 సిఆర్ఫీఎఫ్ వాళ్ళు వచ్చారన్నారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఐటి రైడ్స్ జరుగుతున్నాయని, ఆపద్దర్మ సీఎం బిజేపితో జత కట్టి కాంగ్రెస్ నాయకుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. గత జనవరి 1న నేను జనాన్నుద్దేశించి మాట్లాడింది మొదలు బిఆర్ఎస్ కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందన్నారు. తనకు బిజేపి లోకి ఆహ్వానాలు వచ్చాయని, వాటిని తిరస్కరించినందుకే ఈ పరిణామాలన్నారు.

కాంగ్రెస్ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో లేదు. నా పైన నా సన్నిహితులపైన దృష్టి పెట్టారు. ఎన్నికష్టాలైన ఓర్చుకుంటాం శీనన్నతో ఉంటాం అని నాఅభిమానులు వేచి చూశారు. బిజేపిలోకి రాలేదని వాళ్ళు, బిఆర్ఎస్ సూచనల మేరకు నాపై ఇబ్బందులు మొదలు పెట్టారు. ఏదైతే నేను ఊహించానో అదే జరిగింది. నామినేషన్ వేయాలని అనుకున్న రోజే కావాలని ఉద్దేశ్యపూర్వకంగా, నన్ను నన్ను నమ్ముకున్న వాళ్ళను భయబ్రాంతులకు గురిచేయడం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. 32 నుండి33 ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాలనుండి వచ్చిన అధికారులతో సోదాలు చేస్తున్నారు. వారు ఎన్ని సోదాలు చేసినా, చిట్ట చివరికి వాళ్ళు చేసేది ఏంటి నన్ను జైళ్ళో పెట్టినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా మన హక్కుల కోసం పోరాటం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని తేల్చిచెప్పారు.

read also : గాంధీ తిరిగిన నేలపై అరాచక పాలన..

ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అనేది ప్రతీ ఒక్కరూ ఆలోచించాలని పొంగులేటి కోరారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎన్నికల్లో పాల్గొనడంలేదు. మావద్ద ఏం ఉంది. ఉన్నదంతా ప్రజాధనం మీవద్దే ఉంది. ఈ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నామీద నాకుటుంబ సభ్యుల జరిగే దాడుల్ని ఖండిస్తున్నాం. చట్టం ప్రతిపక్షంలో ఉన్న మా ఒక్కిరికే కాదు. ప్రతిపక్షాలను కూడా వారి పని వారు చేసుకునే విధంగా ఉండాలి.

నామినేషన్ వేయడానికి నన్ను వదలకపోతే లక్షలాదిమంది నా అభిమానులు వస్తే, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే నాకు సంబంధం లేదని చెప్పాను. ఎన్నికల నియమావళి ప్రకారం ఏ మనిషికి అయినా, నామినేషన్ వేసే హక్కు ఉంది. నాస్వేచ్చను హరిస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఈసి కి ఫిర్యాదు చేశాం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. ప్రజా బలం ఉన్న ఏపార్టీ అయినా, ఏ నాయకుడైనా ఈ చర్యలకు భయపడడన్నారు.

Leave A Reply

Your email address will not be published.