Read News in Telugu Language
adsdaksha

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కుంటాం..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 16

– సిపిఐ పార్టీ బలపరిచిన పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..

– వెయ్యి కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక..

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సిపిఐ పార్టీ బలపరిచిన పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కార్యకర్తలపై పెట్టించిన అక్రమ కేసులను ఎత్తివేపిస్తానని పేర్కొన్నారు. మన ఓట్లపై గెలిచి చల్లుకున్న కుంకాలు ఆరకముందే పార్టీ ఫిరాయించడమే కాకుండా దౌర్జన్యంగా కార్యకర్తలపై కేసులు పెట్టించడం దుర్మార్గమన్నారు.

Hospital

ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని కైకొండాయిగూడెం 1 డివిజన్ కార్పొరేటర్ తేజావత్ హుస్సేన్, సుమారు వెయ్యి కి పైగా కుటుంబాలు గురువారం నాగటి ఉపేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వీరికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పొంగులేటి మాట్లాడుతూ… పాలేరు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తనకు చెబుతున్న ఒకే ఒక్క మాట తమపై ఇష్టానుసారంగా అక్రమ కేసులు బనాయించినట్లుగా తెలుపుతున్నారని అన్నారు. డిసెంబర్ 9వ తారీఖున రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటానని అన్నారు. ఈ కేసుల విషయంపై తాను ,తుమ్మల ,భట్టి అనేక వేదికలపై కార్యకర్తలకు హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన మాట చేసిన వాగ్దానాలకు ఒక్క అడుగు కూడా వెనక్కి వేసేది లేదన్నారు.

Read also : 17 న రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలి..

విచారణ చేపించి అక్రమ కేసులు అన్నింటిని ఏ విధంగా డ్రాప్ చేపించాలో చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇంకా 12 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉందని కష్టపడి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో తుమ్మలను, పాలేరులో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా మీ మీ పరిచయాలను బట్టి బంధువులు, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులతో మాట్లాడి కాంగ్రెస్కు ఓట్లు వేయించే ప్రయత్నం చేయాలన్నారు.

అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నా అభిమతం ఎప్పుడు అభివృద్దే అన్నారు. గ్రామాల్లో ఘర్షణ వాతావరణం తనకు ఇష్టం ఉండదన్నారు. రాజకీయాలు విధానపరంగా ఉండాలే తప్ప దాడులు చేసుకునేలా ఉండకూడదన్నారు. మంచి రోజులు రాబోతున్నాయని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు. పొంగులేటి.. తుమ్మల వేరు కాదని మేమిద్దరం ఒక్కటే అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకుడు రాంరెడ్డి శ్రీ చరణ్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, జిల్లా నాయకుడు బాలసాని లక్ష్మీనారాయణ, మండల నాయకులు కన్నేటి వెంకన్న, బైరు హరినాథ్ బాబు, మద్ది వీరారెడ్డి, బోడ వీరన్న, స్థానిక నాయకులు నాగాటి రాజు, భూక్య ఉపేందర్ ,శీలం వెంకన్న ,సిహెచ్ వీరస్వామి, అక్కిరామయ్య పందుల శివరాం రామయ్య , నాగయ్య , ఎల్ వెంకన్న, సంపేట ఉపేందర్, గిరి,గంగావత్, శ్రీనివాస్, షేక్ సబిక్ , బి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.