Read News in Telugu Language
adsdaksha

మార్పురావాలంటే హస్తం గుర్తు పై ఓటేయ్యాలి .. దొరల రాజ్యంకు ఫుల్​స్టాప్​ పెట్టాలి..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 17

అధికారంలోకి రాగానే ఎకకాలంలో రూ. 2లక్షల రుణమాఫీ..

రూరల్​ ప్రచారంలో పాలేరు కాంగ్రెస్​ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..

రాష్ట్రంలో మార్పు రావాలంటే బీఆర్​ఎస్​ ( brs ) ను ఓడించేందుకు కాంగ్రెస్​ ( congress ) గుర్తు హస్తం గుర్తు పై ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని, కాంగ్రెస్​ తెలంగాణ ఇస్తే కేసీఆర్​ దొచుకొని తినడం మొదలుపెట్టాడని అటువంటి పందికొక్కైన కేసీఆర్​ ( kcr ) ను ఇంటికి పంపాల్సిన సమయం అసన్నమైందని పాలేరు కాంగ్రెస్​ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivas reddy ) అన్నారు. శుక్రవారం రూరల్​ మండలం ఆరెకోడు, ఆరెకోడుతండా తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నిక దొరల పరిపాలనకు, దోపిడీ పరిపాలనకు, ఇందిరమ్మ రాజ్యానికి జరుగుతున్న యుద్ధం అని అన్నారు. ఈ ఎన్నికలు గతంలో జరిగిన ఎన్నికలకు పూర్తి బిన్నంగా ఉంటాయన్నారు.

Hospital

ఈ ఎన్నికలు మన నీళ్లు, మన నిధులు, మన నియమాకాల కోసం జరుగుతున్నాయన్నారు. ఆనాడు ఉద్యమం చేశామని చెపుతున్న ఈ ప్రబుద్ధుడు ప్రజలను విస్మరించి సంపాదనే ఎజెండాగా పెట్టుకున్నాడని విమర్శించారు. 2014 కు ముందు కేసీఆర్ ఆస్థులెంత..? ఇప్పుడు ఆస్తులు ఎంత ప్రజలు ఆలోచించాలన్నారు. ఎంతో మంది పోరాట ఫలితంగా తెలంగాణ వస్తే ఈనాడు కేవలం ఒక్క కల్వకుంట్ల కుటుంబానికే తెలంగాణ వచ్చిందా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని 10 ఏళ్లుగా నిరుద్యోగులు ఎదురు చూశారని కానీ నోటిఫికేషన్​లు రద్ధు, పేపర్​ లీకేజీలతోనే సమయాన్ని గడిపి నిరుద్యోగులతో చలగాటం ఆడుకున్నారన్నారు.

read also : తెలంగాణ వచ్చాక మైనార్టీల అభివృద్ధి ఎంతగానో జరిగింది..

నిరుద్యోగులకు ఉద్యోగాలు అయితే రాలేదు కానీ కేసీఆర్ కుటుంబం లో మాత్రం ఆరు ఉద్యోగాలు సంపాదించుకున్నారని ఎద్దేవా చేశారు. దీనికి పులిస్టాఫ్ పెట్టే సమయం ఆసన్నమైందని, ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రజా పరిపాలన కోసం హస్తం గుర్తుపై ఓటేసి మంచి మెజారిటీ తో గెలిపించాలన్నారు. గత ఎన్నికల్లో 14 రోజుల ముందు పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థికి బీఫామ్ ఇస్తే ఆనాడు పొత్తులో ఉన్న పార్టీలు గెలిపించాయని, గెలిచిన మూడు నెలల్లోనే ఆయన అధికార పార్టీలోకి జంప్ చేశారన్నారు. ప్రజలు ఎందుకు పార్టీ మారారు అని అడిగితే అభివృద్ధి కోసం మారిన అని చెప్పారని అభివృద్ది మాత్రం నిల్​.. దొపిడి మాత్రం ఫుల్​ లాగా ఎమ్మెల్యే పనితీరు ఉందని విమర్శించారు.

మీ గ్రామాలకు ఎన్ని డబుల్ బెడ్ రూం ఇళ్ళు, దళిత బందు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చారని ప్రజలను పొంగులేటి ప్రశ్నించారు. ప్రజలందరి సమస్యలు పరిష్కారం కావాలంటే హస్తం గుర్తుకు ఓటేసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.