Read News in Telugu Language
adsdaksha

అసెంబ్లీలో ప్రతిపక్షనేతలు రంకెలేస్తున్నారు..ఇంకా అధికారంలోనే ఉన్నామనుకుంటుంన్నారు..

దక్ష న్యూస్, ఖమ్మం: డిసెంబర్ 18

– మీడియా సమావేశంలో పొంగులేటి..

అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నేతలు రంకెలేస్తున్నారని, ఇంకా వాళ్లు అధికారంలోనే ఉన్నామని కలలు కంటున్నారని తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( ponguleti srinivas reddy ) అన్నారు. సోమవారం ఖమ్మం ( khammam ) కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… ధనిక రాష్ట్రం అయిన తెలంగాణ ( telangana ) ను కొల్లగొట్టి, ఖజానా ఖాళీ చేశారని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు చెబుతున్నామని, వారిలా తాము మాయమాటలు చెప్పబోమని, ప్రజలను మోసం చేయబోమని అన్నారు. ఉద్యోగులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని, ఎవరైతే ప్రజాధనం దోపిడీ చేశారో, ప్రభుత్వ భూములు ఆక్రమించారో వాటన్నింటిపై సమీక్షలు చేసి సరిదిద్దుతామనిఅన్నారు.

read also : తెలంగాణ అగ్రి యూనివర్సిటీలో డ్రోన్ అకాడమీకి డిజిసీఎ ఆమోదం..

గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దడమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలందాలని అధికారులను కోరినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అధికారులను వేధించటానికి సమీక్ష చేయలేదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రెండ్లీ ప్రభుత్వమన్నారు. ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేసే అధికారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆరు గ్యారంటీల అమలు లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇది ఇందిరమ్మ రాజ్యమని… ప్రజారాజ్యమని, జర్నలిస్టులకూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Hospital

సామాన్య ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలన్నదే తమ లక్ష్యమని పొంగులేటి వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇల్లు లేని వ్యక్తి ఉండకూడదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టుల నిర్మాణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించబోతున్నామని, ధరణి పేరుతో జరిగిన దోపిడీని బట్టబయలు చేసి నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు.

read also : తెలంగాణ రాష్ట్రం నుండి సోనియా గాంధీ పోటీ చేయాలి: టి-కాంగ్రెస్…

ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా పొంగులేటి..

ఖమ్మం: లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ నుంచి సోమవారం ఓ ప్రకటన వెలువడింది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులకు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో ఖమ్మం, మహబూబాబాద్ స్థానాలు పొంగులేటికి అప్పగించారు.

Leave A Reply

Your email address will not be published.