Read News in Telugu Language
adsdaksha

కార్మికుల గుండెల్లో కాంగ్రెస్ ఉంది..

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం : డిసెంబర్ 25

సింగరేణి ఎన్నికల్లోను ఐ ఎన్ టి యూ సి ని గెలిపించాలి : పొంగులేటి..

సింగరేణి వ్యాప్తంగా ఒక్కచోట మినహా అన్నిచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారని సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivas reddy )  అన్నారు. సోమవారం సింగరేణి ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2017 నుండి సింగరేణి కార్మికుల సమస్యల పట్ల తనకు అవగాహన ఉన్నదన్నారు.

గతంలోనే జరగాల్సిన ఎన్నికలను గత ప్రభుత్వం ఓటమి భయంతో జరపలేదని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం అవకతవకలతో కార్మికులను పట్టించుకోలేదని అన్నారు. గత ప్రభుత్వం మాటలు మీతో పాటు నేను కూడా నమ్మి మోస పోయానన్నారు. నేడు వచ్చిన ప్రభుత్వంలో నేను కీలక మంత్రి పదవి లో ఉన్నాను. మీ సమస్యల పరిష్కారానికి సీఎం పక్కన కూర్చోనైనా సంతకం పెట్టిస్తానని హామీ ఇచ్చారు.

Read also : ఆకలి తీర్చిన దేవాలయానికి 99 యేళ్లు..

Hospital

గత ఐదు సంవత్సరాలలో సింగరేణి గనులు కనుమరుగై కార్మికుల సంఖ్య తగ్గుతూ వచ్చిందని మంత్రి పొంగులేటి అన్నారు. మా మేనిఫెస్టోలో పెట్టిన రెండు లక్షల ఉద్యోగాల కల్పనలో సింగరేణి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తాం అన్నారు.

ఇల్లందులో జేకే ఓ సి విస్తరణ లో ఇక్కడ కార్మికులు బదిలీ కాకుండా… ఇంకొక మైనింగ్ ఫిట్3 తో కార్మికులు ఇక్కడే విధుల్లో ఉండేలా చూస్తాం అని పొంగులేటి అన్నారు. కార్మికుల సొంతింటి కల కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని తెలిపారు.

కార్మికులకు వైద్యం కోసం మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని పొంగులేటి పేర్కొన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఈ ప్రభుత్వ హయాంలో పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు.

పోరాటాలు చేశాం …అని చెప్పుకొనే కార్మిక సంఘాలు ఇంకా ఉండవు…20 సంలు ప్రభుత్వంలో కి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే కారుణ్య నియామకాల కోసం కార్మికులు లక్షలు ఇచ్చే పరిస్థితి ఉండేది… ఇకనుంచి ఒక్క రుపాయి ఖర్చు పెట్ట కుండా కారుణ్య నియామకాలు చేస్తాం అని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.