Read News in Telugu Language
adsdaksha

ప్రజలకు పారదర్శకంగా నాణ్యమైన రిజిస్ట్రేషన్ సేవలు అందించాలి: పొంగులేటి..

దక్ష న్యూస్, హైదరాబాద్: డిసెంబర్ 27

ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా త్వరితగతిన, పారదర్శకంగా నాణ్యమైన రిజిస్ట్రేషన్ సేవలను అందించాల్సిన అవసరముందని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ( ponguleti srinivas reddy ) రెడ్డి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.
రిజిస్ట్రేషన్ శాఖ వనరుల పెంపుదలపై దృష్టి సారించాలని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సమానమైన పని పంపిణీ జరిగేలా విభాగాన్ని క్రమపద్ధతిలో పునర్వ్యవస్థీకరించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.
బుధవారం మంత్రి సచివాలయంలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమావేశమై శాఖ పనితీరును సమీక్షించారు.

Hospital

read also : ప్రజాపాలనకు ఉమ్మడి జిల్లాల వారీగా నోడల్ అధికారుల నియామకం ..

ఈ సందర్భంగా మాట్లాడుతూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణాన్ని ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపడతామని తెలిపారు.
రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, అదనపు ఐజీ వెంకట్ రాజేష్, జాయింట్ ఐజీ శ్రీనివాసులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల డిప్యూటీ ఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.