Read News in Telugu Language
adsdaksha

ప్రజల చెంతకే ప్రభుత్వ పథకాలు..మీరిచ్చే ప్రతి దరఖాస్తు కంప్యూటరైజ్ చేస్తాం…

దక్ష న్యూస్, ఖమ్మం: జనవరి 2

ప్రజల చెంతకే ప్రభుత్వ పథకాలు అని, మీరిచ్చే ప్రతి దరఖాస్తు కంప్యూటరైజ్ చేస్తాం అని రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivasreddy ) అన్నారు. మంగళవారం పాలేరు ( paleru ) నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణం,సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు గ్రామ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు నడుం బిగించిందన్నారు. ఈ 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని పేర్కొన్నారు.

Read also: మెట్రో విస్తరణపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి ..

ఈనెల 6వతేదీ వరకు ప్రజాపాలన గ్రామ సభలు జరుగుతాయని పొంగులేటి తెలిపారు. ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోకే పాలనను తెచ్చామని అన్నారు.

గత పదేళ్లుగా స్వరాష్ట్రంలో ప్రజల కలలు కల్లలైపోయాయని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. 671 లక్షల కోట్లు రూపాయల అప్పును తెలంగాణ నెత్తిన పెట్టారన్నారు. అప్పులు తప్పుకాక పోయినా, సరైన రీతిలో ఆ నిధులను సద్వినియోగం చేయలేదని విమర్శించారు. కేవలం వారు అధికారాన్ని అనుభవించేందుకే తెలంగాణను వాడుకున్నారని దుయ్యబట్టారు.

Hospital

Read also: ఏపీ లోనూ ఆర్టీసి బసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..

విలాసాలు, భోగాలు అనుభవించి ప్రజల సమస్యలను నాటి బి ఆర్ ఎస్ పాలకులు పక్కన పెట్టారని శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం తెలంగాణకు సమకూర్చిన ఆస్తులు, ప్రగతి భవన్, కూల్చి కట్టిన సెక్రటేరియట్ మాత్రమే అన్నారు.

తెలంగాణ లో ఉన్న ప్రజా సమస్యలను చిత్తశుద్ధితో పనిచేసేందుకు ముఖ్యమంత్రి, మంత్రులం కృషి చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.
ప్రజల కష్ట, సుఖాలలో పాలుపంచుకుంటాం అన్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్లాయని, కిందిస్థాయి లో ఉన్నటువంటి పేదలకు ప్రభుత్వ పథకాలు అందాలనేదే ప్రభుత్వ తాపత్రయం అన్నారు.

ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండానే ప్రజాపాలన గ్రామ సభలు కార్యక్రమం పూర్తి చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. మీరిచ్చే ప్రతి అప్లికేషన్ ని కంప్యూటరైజ్ చేస్తాం అన్నారు.
తెలంగాణ ప్రజల కోర్కెలన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.