Read News in Telugu Language
adsdaksha

జర్నలిస్టుల సంక్షేమానికి ఉన్నతస్థాయి సమావేశం..

దక్ష న్యూస్, ఖమ్మం: జనవరి 4

టీయూడబ్ల్యూజే ఐజేయూ, బృందానికి మంత్రి పొంగులేటి హామీ..

జర్నలిస్టుల సంక్షేమం, ఇంటి స్థలాలకు సంబంధించి జనవరి 15తర్వాత సంబంధిత ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( ponguleti srinivas reddy ) హామీ ఇచ్చారు.

గురువారం సాయంత్రం సచివాలయంలోని మంత్రి చాంబర్ లో ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ( tuwj) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీల నేతృత్వంలో ఐజేయు ( iju ) కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు కె.రాంనారాయణలతో కూడిన ప్రతినిధి బృందం మంత్రి పొంగులేటి తో భేటీ అయింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై ప్రతినిధి బృందం చర్చించింది.

Hospital

Read also : ఖమ్మం జిల్లా కు సమాచార శాఖ ఏ.డి కార్యాలయం మంజూరు..

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టుల ఇంటి స్థలాలకు సంబంధించి గత ప్రభుత్వాలు ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు, మెమోలను సేకరించాలని, అలాగే వాటి ద్వారా ఇచ్చిన స్థలాల వివరాలు, స్వాదీనం చేయకుండా ఉన్న స్థలాల వివరాలు, ఇకముందు ఇవ్వడానికి అనువైన స్థలాలను నిర్ధిష్టంగా పేర్కొంటూ నివేదికలు పంపించాలని రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రతినిధి బృందానికి మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల విషయమై జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా గడిచిన రెండు దశాబ్దాలుగా ఇంటి స్థలాలు ఇవ్వనందున జర్నలిస్టులు అధిక సంఖ్యలో ఉన్నారనే విషయాన్ని ప్రతినిధి బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్ళింది. వీటితో పాటు చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ విషయాన్ని ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి ప్రస్థావించగా, ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, ముఖ్యమంత్రితో చర్చించి తప్పని సరిగా పరిష్కారం చూపుతామని మంత్రి హామీ ఇచ్చారు.

Read also: ఆరు గ్యారంటీలతో ప్రతీ కుటుంబానికి లబ్ది : మంత్రి తుమ్మల..

జర్నలిస్టుల నివేశన స్థలాలు, ఇతర సంక్షేమ చర్యలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై ఒక విధానపరమైన ప్రకటన చేస్తామని మంత్రి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన వివిధ అంశాలపై టీయూడబ్ల్యూజే ఇచ్చిన 3పేజీల వివరణాత్మక వినతి పత్రాన్ని కులంకశంగా చదివి చర్చించిన మంత్రికి ప్రతినిధి బృందం కృతఙ్ఞతలు తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.