Read News in Telugu Language
adsdaksha

అప్పులను చూపి .. తప్పించుకునే ప్రభుత్వం కాదు : పొంగులేటి

దక్ష న్యూస్, ఖమ్మం: జనవరి 10

కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులను చూపి తప్పించుకునే ప్రభుత్వం కాదని ఇందిరమ్మ రాజ్యం లో ఆరు గ్యారంటీ లను అమలు చేసి తీరుతాం అని సమాచార రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

ఖమ్మం రూరల్ మండలం మల్లెమడుగు, ఏదులాపురం, కొండాపురం గ్రామాల్లో బుధవారం నూతన హెల్త్ సెంటర్ భవనాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivas reddy ) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాపాలన కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారన్నారు.

Read also: దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించం..

Hospital

మొన్న జరిగిన ఎన్నికల్లో మీ దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని పొంగులేటి అన్నారు. మీరందరూ బాగుండాలని ఈ ప్రభుత్వం కోరుకుంటుందని అందుకు
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం అన్నారు.

హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీ లు అమలుచేసాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తుచేశారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అధికారులు మీ దగ్గరకు వచ్చి మీ కష్టాలు తెలుసుకుని మిగతా గ్యారంటీ లను మీ ముందుకు తెస్తారన్నారు.

Read also: 18 నుండి బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ఈవెంట్..

తీసుకున్న అప్లికేషన్లలో మీ అవసరాలను గుర్తించి పేదవారిలో అతి పేదవారి నుంచి మొదలుకుని అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని పొంగులేటి తెలిపారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులను చూపి పని చేయకుండా తప్పించుకునే ప్రభుత్వం కాదు ఇందిరమ్మ ప్రభుత్వం ..ఎన్ని అవాంతరాలు,కష్టాలు ఎదురైనా మీకు ఇచ్చిన మాటకు కట్టుబడి వాటిని తీర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.

Leave A Reply

Your email address will not be published.