Read News in Telugu Language
adsdaksha

మంత్రి పొంగులేటి సంక్రాంతి శుభాకాంక్షలు..

దక్ష న్యూస్, ఖమ్మం : జనవరి14

తెలుగింట పెద్ద పండుగ సంక్రాంతి పర్వదినాన్ని అంతా సంబురంగా జరుపుకోవాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  ( ponguleti srinivas reddy ) ఆకాంక్షించారు. కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో తెలంగాణ ( telangana ) రాష్ట్ర ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు. ఆరుగాలం శ్రమించే రైతన్నల పంటలు ఇంటికొచ్చే సందర్భంలో వచ్చే ఈ పండుగ ఎంతో గొప్పదని పేర్కొన్నారు.

read also : రాష్ట్ర ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు..

ఇందిరమ్మ రాజ్యంలో కర్షకులందరికీ లబ్ధి చేకూరుస్తామని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పొంగులేటి తెలిపారు. కౌలు రైతులు సహా కూలీలు, అన్నిరకాల కార్మిక, శ్రామికులకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. వాకిళ్లలో ఆడపడుచులు తీర్చిదిద్దిన తీరొక్క రంగవల్లులు, పేర్చిన గొబ్బెమ్మలు, కలసిమెలిసి చేసుకునే పిండివంటలు, డూడూ బసవన్నల ఆటలు.. అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుళ్లతో అంతా సందడి నెలకొనే ఈ సంప్రదాయం ఎంతో మధురానుభూతిని మిగులుస్తుందని పొంగులేటి అన్నారు. ఈ సంక్రాంతి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో కొత్త సందళ్ళు తేవాలని ఆకాంక్షించారు.

Hospital

read also : కాంగ్రెస్ నెల రోజుల పాలన భేష్.. సామాన్యులకు అందుబాటులో సీఎం రేవంత్ రెడ్డి..

పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్లు అందజేత..

ఖమ్మం రూరల్: పొంగులేటి స్వరాజ్యం, రాఘవ రెడ్డి (పీ ఎస్ ఆర్ ) చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పలువురు యువ క్రీడాకారులకు మంత్రి పొంగులేటి కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి క్రికెట్ కిట్లను అందజేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఖమ్మం రూరల్ మండలం సాయి గణేష్ నగర్ లోని పాలేరు నియోజక వర్గ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మేరకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉభయ జిల్లాల సమగ్రాభివృద్ధికి విశేష కృషి చేయబోతున్నారని తెలిపారు. యువత దేశానికి వెన్నుముక అని, అందుకే క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఈ కిట్లను పీ ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేసినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.