Read News in Telugu Language
adsdaksha

జిల్లాలో రేపు మంత్రి పొంగులేటి పర్యటన ..

దక్ష న్యూస్, ఖమ్మం : జనవరి 16

 

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( ponguleti srinivas reddy ) బుధవారం ఖమ్మం ( khammam ) జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ( tumburu dayakar reddy ) మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా ఉదయం పదకొండు గంటలకు నేలకొండపల్లి మండలంలోని బోదులబండ, నేలకొండపల్లి గ్రామాల్లో, మధ్యాహ్నం పన్నెండు గంటలకు కూసుమంచి మండల కేంద్రంలో, ఒంటిగంటకు తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు, పాతర్లపాడు, జింకలగూడెం గ్రామాల్లో, మధ్యాహ్నం మూడు గంటలకు ఖమ్మం రూరల్ మండలంలోని చింతపల్లి గ్రామంలో, మూడున్నర గంటలకు ఖమ్మం నగరంలోని రాపర్తినగర్ ప్రాంతాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు.

read also : ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తాం ..

Hospital

ఆయా ప్రాంతాల్లో జరిగే పలు వివాహ వేడుకలకు హాజరై మంత్రి నూతన వధూవరులను ఆశీర్వదిస్తారని తెలిపారు. అదేవిధంగా ఇటీవల చనిపోయిన పలువురు వ్యక్తుల కుటుంబాలను పరామర్శించి ఓదారుస్తారని పేర్కొన్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటారని దయాకర్ రెడ్డి తెలిపారు.

read also : డాక్టర్ మట్టా దయానంద్ ని కలిసిన తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు ..

రేపు మంత్రి పొంగులేటి చే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..

కూసుమంచి : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచి లోని పాలేరు నియోజక వర్గ క్యాంప్ కార్యాలయంలో బుధవారం కూసుమంచి మండలానికి చెందిన 12మంది లబ్ధిదారుల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారులందరూ సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు.

 

 

Leave A Reply

Your email address will not be published.