Read News in Telugu Language
adsdaksha

తమ్మినేని కి మంత్రి పొంగులేటి పరామర్శ .. మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా డాక్టర్ లకు సూచన..

దక్ష న్యూస్, హైదరాబాద్ : జనవరి 18

లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ( thammineni veerabhadram ) ను గురువారం తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivas reddy ) పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

Hospital

read also : 26న పబ్లిక్ గార్డెన్స్‌ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష..

తమ్మినేనికి మెరుగైన వైద్య సేవలు అందించి త్వరగా కోలుకునేలా కృషి చేయాలని మంత్రి పొంగులేటి డాక్టర్లకు సూచించారు. తమ్మినేనిని పరామర్శించిన వారిలో మంత్రి పొంగులేటి వెంట ఖమ్మం జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.