Read News in Telugu Language
adsdaksha

గృహనిర్మాణ శాఖ ఉద్యోగులను నా కుటుంబ సభ్యులుగా చూస్తా : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 3

రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ లు ప్రభుత్వం పరిష్కరిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivasreddy ) హామీ ఇచ్చారు. అన్ని శాఖల ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు 10 ఏoడ్ల పాటు ఇబ్బంది పడినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ గృహవసతి కల్పిస్తామని చెప్పారు.

Read also: ఫాస్టాగ్ గడువు పెంపు.. ఈనెల 28వరకు ఈ-కేవైసీ చేసుకోవచ్చు..

Hospital

అల్లుడు, కోడలు వస్తే ఎక్కడ ఉంటారు అని గత ప్రభుత్వం పేదలను మభ్యపెట్టిoదని మంత్రి అన్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లో రెవెన్యూ మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో తెలంగాణా రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్స్ వర్క్  ఇన్స్పెక్టర్ అసోసియేషన్ ( wark inspectors assosiation ) ముద్రించిన డైరీ  క్యాలండర్ ను శనివారం రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హౌసింగ్ ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం భాధ్యత నాది అని అన్నారు. గత ప్రభుత్వం హౌసింగ్ ను, ఉద్యోగులను ఛిద్రం చేసి ఎన్నో రకాల ఇబ్బందులకు గురిచేసిందని మా ప్రభుత్వం గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యులు మాదిరిగా కాపాడు కుంటుందని ఆందోళన చెందవద్దని అభయం ఇచ్చారు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు జరగాలని ఆకాంక్షించారు.

Read also: అద్వానీకి భారతరత్న.. ప్రధాని మోడీ కీలక ప్రకటన..

ఈ సమావేశం లో హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య, సంఘం అధ్యక్షుడు గవ్వ రవీందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బొగ్గుల వెంకట రామిరెడ్డి, కార్య దర్శి రఘువీర్ ప్రసాద్ గుప్తా, జనరల్ మేనేజర్లు చైతన్య, బలరామ్, కుమార్, ఆంజనేయులు, జగన్, అథార్, భాస్కర్ రెడ్డి, దుర్గా ప్రసాద్, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.