Read News in Telugu Language
adsdaksha

ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం – వంద రోజుల పాలనపై రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 15

– 2008 డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులకు ఉద్యోగాలు..

-విధ్వంసకర పాలన నుంచి ప్రజా పాలనలోకి..

డిసెంబర్ 7వ తేదీ…యావత్ తెలంగాణ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక రోజు అని, ఆత్మ గౌరవం పెంపొందిన రోజు అని రెవెన్యూ హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి ( ponguleti srinivas reddy ) అన్నారు. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ లక్ష్యం దిశగా పనిచేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ( congress ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శుక్రవారం నాటికి వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా వంద రోజుల పాలనపై మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటవ తేదీన వేతనాలు చెల్లించే స్థాయికి చేరుకున్నామని పొంగులేటి తెలిపారు. “గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వివిధ రంగాలలో ముఖ్యంగా ఆర్థికంగా సామాజికంగా విధ్వంసానికి గురైందన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా విధ్వంసం అనంతరం ఆయా వ్యవస్థలను పునర్మించుకోవడం అంత తేలికైన పని కాదని, కానీ తెలంగాణను తిరిగి బాగు చేసుకోవడానికి, పునర్నిర్మించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన శక్తినంత కూడగట్టుకొని ఒక్కో అడుగు వేసుకుంటూ ఇచ్చిన వాగ్దానాలు తూచ తప్పకుండా అమలు చేస్తు విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు.

read also : ఖమ్మం నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాం : మంత్రి తుమ్మల..

తెలంగాణ ఉద్యమకారులతోపాటు యావత్ తెలంగాణ ప్రజానీకం సంతృప్తి చెందేలా వంద రోజుల పాలన ఉందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను శరవేగంగా అమలు చేస్తూ వంద రోజుల్లో తెలంగాణలోని ప్రతి పౌరుని హృదయంలో గొప్ప స్థానాన్ని ఈ ప్రభుత్వం సంపాదించుకుందన్నారు. గెలిచిన 48 గంటల్లోనే ప్రభుత్వం కొలువు దీరిన డిసెంబర్ 7వ తేదీన అభయ హస్తం ఆరు గ్యారంటీలకు కేబినేట్ ఆమోదం తెలిపి 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం పరిమితిని పది లక్షలకు పెంచి చరిత్ర సృష్టించిందన్నారు.

ఇప్పటి వరకు 24 కోట్ల మందికి పైగా మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణం చేసినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. 80 రోజుల్లో గృహ విద్యుత్ కనెక్షన్ పై 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు సదుపాయం గృహజ్యోతి, తెల్ల రేషను కార్డు కలిగిన 40 లక్షల మంది మహిళలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించే మహాలక్ష్మి ఎల్.పీ.జి. పథకాన్ని 80 రోజుల్లోనే అమలు చేశాం అన్నారు.

read also : గురుదత్తా ఫౌండేషన్ ను సందర్శించిన మంత్రి తుమ్మల.. రహదారుల నిర్మాణానికి ఆదేశం..

90 రోజుల్లో 5వ గ్యారంటీ ఇందిరమ్మ ఇళ్ల పథకం… ఆరు గ్యారంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల సహాయం అందజేస్తుందన్నారు. ఈ పథకాన్ని మార్చి 11వ తేదీన భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు.

ఈ ఏడాది ఈ పథకం కింద నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 4.5 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మొత్తం ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మా ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.

కొలువుల జాతర..

“గత బీఆర్ఎస్ పాలన వైఫల్యాలలో అన్నిటికంటే ముఖ్యమైనది ఉద్యోగ కల్పనలో సాగిన అవకతవకలు, అక్రమాలు, వాగ్ధాన భంగాలు, ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ నిరుద్యోగుల ఉసురుపోసుకున్న ప్రభుత్వం అదని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. మా వంద రోజుల పాలనలో దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా శరవేగంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకం జరపడం ద్వారా తెలంగాణ యావద్దేశానికి ఆదర్శంగా నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. ఒకనాడు తెలంగాణ నిరుద్యోగ యువత కన్న కలలు నేడు సాకారమవుతున్నాయన్నారు.

read also : tspsc : గ్రూప్ 1 దరఖాస్తుల గడువు పెంపు .. ఈనెల 16 వరకు పెంచిన టీఎస్పీఎస్సీ..

మూడు నెలల్లోనే 29వేలకు పైగా ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందచేయడం, ఉద్యోగ వయోపరిమితి పెంచడం, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం, గ్రూప్ పరీక్షలకు తేదీలు ప్రకటించడం నిరుద్యోగుల్లో ఆనందం నింపిందన్నారు.

Hospital

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఏడాదిలోపే అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుంన్నట్లు పొంగులేటి వెల్లడించారు. అస్తవ్యస్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ను సంపూర్ణ ప్రక్షాళన చేశామన్నారు.

563 పోస్టులతో కూడిన కొత్త గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసి జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్షకు సన్నహలు చేస్తున్నామన్నారు. 6956 స్టాఫ్ నర్సులకు 441 సింగరేణి ఉద్యోగాలు, 2144 లైబ్రెరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 13,444 పోలీస్, ఎక్సైజ్, ట్రాన్స్ పోర్ట్, కానిస్టేబుల్ లకు 5,192 లెక్చరర్లు, టీచర్లు, కానిస్టేబుల్లు, మెడికల్ సిబ్బందికి నియామక పత్రాలు ప్రధానం చేశామన్నారు. మూడు నెలల్లోపే 29వేల మందికి ఉద్యోగ నియామకాలు. 11063 టీచర్ పోస్టులకు మేగా డిఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేశామన్నారు.

read also : పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. లీటర్ పెట్రోల్ పై రూ.2, డీజిల్ పై రూ.2 తగ్గింపు

డీఎస్సీ కంటే ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు చర్యలు.. తాజాగా సింగరేణిలో 327 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని మంత్రి పొంగులేటి అన్నారు. 2008 డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు.

విధి నిర్వహణలో, అనేక కారణాలతో మరణించిన 178 మంది వీఆర్వోల కుటుంబాలకు కారుణ్య నియామకం చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అక్టోబర్ లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు, ఆగస్టులో గ్రూప్-2 పరీక్షలు, నవంబర్ లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వంద రోజుల్లో ఎల్ బీ స్టేడియం ఉద్యోగ నియామక పత్రాలను అందజేసే వేదికగా మారిందన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులకు 21శాతం ఫిట్మెంట్, కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయం తీస్కోవడం జరిగిందని పొంగులేటి వెల్లడించారు.  గత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో జరిగిన కాలయాపనతో వయోపరిమితి దాటిపోయిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు ఉండగా ఇప్పుడు 46 సంవత్సరాలు పెంచడం జరిగిందన్నారు.

ప్రజావాణి..

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను నుంచి విముక్తి కల్పించామని పొంగులేటి అన్నారు. ప్రగతిభవన్ ను మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్ గా మార్చామని, ప్రతివారం ఈ ప్రజాభవన్ లో రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటుంన్నామన్నారు.

సచివాలయంలో సందడి..

గతంలో నిర్మానుషంగా ఉన్న సచివాలయంలో సందడి పెరిగిందని పొంగులేటి అన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి, మంత్రులు అందుబాటులో ఉంటారని, వారిని కలిసి తమ సమస్యలు చెప్పుకోవచ్చన్న విశ్వాసం ప్రజల్లో ఏర్పడిందన్నారు. ధరణి ప్రక్షాళన భూ సమస్యలకు శరఘాతంగా మారిన ధరణి పోర్టల్ ను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు పొంగులేటి వెల్లడించారు. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో ధరణి పునర్నిర్మాణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
గత ప్రభుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి ఆధ్యయనం చేయకుండా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించేందుకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు.

read also : ఏసీబీ కి చిక్కిన జూపార్క్ ఆఫీసర్.. 5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రమేశ్ ..

గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఏదో ఒక కుటుంబం ధరణితో సమస్యలను ఎదుర్కొంటుందని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందన్నారు.

ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన 2,46,536 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. వీటి పరిష్కారానికి మార్చి 1వ తేది నుండి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో 50 శాతం దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని, మిగిలిన దరఖాస్తులను పరిష్కరించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

ప్రజాపాలనలో ఆంక్షలులేని వాతావరణం కల్పించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఉద్యమ ఆకాంక్షలను ప్రతిబింబించేలా మా పాలన సాగుతోందని తెలిపారు. బలహీన వర్గాల బలోపేతం కోసం రాష్ట్రంలో కులగణన చేపట్టాలని అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగిందన్నారు. తెలంగాణకు 40 వేల కోట్ల పెట్టుబడులు దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణలో 40 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామివేత్తలు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం చౌటుప్పల్, ఆమన్ గల్, షాద్ నగర్, సంగారెడ్డిలపై 1082 కిలోమీటర్ల జాతీయ రహదారికి మోక్షం లభించిందన్నారు. రాజీవ్ రహదారిపై దీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఎక్స్ ప్రెస్ కారిడార్ కి, పాతబస్తీకి కొత్త అందాలు తెచ్చే మెట్రోరైలు ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేయడం వంటి కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు.

Leave A Reply

Your email address will not be published.