Read News in Telugu Language
adsdaksha

నొప్పించక తానొవ్వక .. శహ ( బాస్ ) శీనన్న.. మరో సారి పొలిటికల్ హీరో అని నిరూపించుకున్న పొంగులేటి .. జయజయధ్వనాలు చేస్తున్న కార్యకర్తలు అభిమానులు..

దక్ష న్యూస్, ఖమ్మం : ఏప్రిల్ 25

మొహంపై చెదరని చిరునవ్వు.. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడిని పోలిన అభయ హస్తం.. నమ్మిన వారికి వెన్నంటి ఉండే గట్టి ధైర్యం. కలలోనైనా ఆపద వస్తే అన్న ఉన్నాడన్న భరోసా .. ఆ నమ్మకం పేరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivas reddy ). పదవి ఉంటేనేం లేకపోతేనేం ప్రజల్లో ఆ పేరే ఓ ప్రభంజనం. పని ఏదైనా, కష్టం ఎవరికి వచ్చినా అన్న దృష్టి పడితే అంతా ఆనందమే అన్న కార్యకర్తల నమ్మకం. అందుకే పార్టీల కతీతంగా పొంగులేటిని అభిమానించే ఉమ్మడి ఖమ్మం ప్రజలకు ఆయనో అపర ధర్మరాజు. ఆయన మాటే శాసనం. ఆయన ఒక్కసారి మాటిచ్చారంటే ఇక ఆ పని పూర్తయినట్లే. అందుకే అన్నఅందించే భరోసా కోసం జిల్లాలోని ఎక్కడెక్కడి గ్రామాలనుండో అన్న అభిమానులు తరలివస్తుంటారు. అన్నా అంటే నేనున్నా అనే కొండంత భరోసాను గుండెల నిండా నింపుకొని ఎక్కడలేని ధైర్యంతో తిరుగు ప్రయాణం అవుతుంటారు.

ప్రజల్లో అంతగా మమేకమై ఎంతో మంది హృదయాల్లో స్థానం సుస్థిరం చేసుకొని ప్రజల ఆశీస్సులే అసలైన అండదండలుగా రాజకీయాల్లో చిరుతలా దూసుకుపోతున్న లెజెండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంచితనంలోనే కాదు అవసరమైతే అనుకున్నది సాధించడంలో చూపించే పట్టుదలతో మరో సారి తన విలక్షణ నైజం చాటుకున్నారు. ప్రత్యర్థుల గుండెల్లోనే కాదు తనను పక్కన పెట్టాలని చూసే వారికి సైతం షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చి తానేంటో నిరూపించుకున్నారు.

లోక్ సభ ఎన్నికల వేళ ఖమ్మం టికెట్ పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో అంతర్మధనం ఓ స్థాయిలో జరిగిందనే చెప్పాలి. ముక్కోణపు అంతర్గత పోరులో తక్కెడ మొగ్గు ఎటువైపు చూపుతుందో .. మహమహులున్న ఖమ్మం గుమ్మంలో ఎటువంటి పరిణాలు చవి చూడాల్సి వస్తుందో అని అంతా ఆందోళనకు గురయ్యారు. అయితే ఖమ్మం టికెట్ విషయంలో పొంగులేటి తన పంతం నెగ్గించుకున్నారు. మధ్యే మార్గంగా నొప్పించక నానొవ్వక తన అభిష్టాన్ని మరో రూపంలో సాధించుకున్నారు. దాంతో ఏం జరగబోతోందో అని ఆసక్తిగా ఎదురుచూసిన ప్రత్యర్థులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయింది. ఇప్పుడు పొంగులేటి వ్యూహరచనకు రాజకీయ ప్రత్యర్థులే కాదు ప్రతీ ఒక్కరూ ఆయన పట్టుదలకు జేజేలు పలికేలా చేసింది.

Hospital

పండుగలా వియ్యంకుడి నామినేషన్ పర్వం..

కయ్యానికైనా వియ్యానికైనా సమానులు కావాలనేది ఒకప్పటి నానుడి. ఇప్పుడా విషయంలో పొంగులేటి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి ఎంపీ టికెట్ కేటాయించడంలో ఉన్న సమస్యలను గుర్తించి తన వియ్యంకుడికి టికెట్ ఇప్పించుకొని అనుకున్నది సాధించడంలో తన పోరాట పటిమను చాటుకున్నారు. తమ్ముడైనా, వియ్యంకుడైనా ఎవరైతే ఏముంది ప్రజల సమస్యలు పరిష్కరించే అవకాశం దక్కడం కంటే అంటూ తన విశాల దృక్ఫధాన్ని చాటుకున్నారు. రాజకీయాల్లో తల పండిన అపరమేధావి వియ్యంకుడి తండ్రి సలహాలు సూచనలతో తన రాజకీయ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటూనే తన వియ్యంకుడికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.

నామినేషన్ వేళ ఘన స్వాగతం..

ఒకప్పటి ఖమ్మం జిల్లా వాసి నేటి ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ( ramasahayam raghuram reddy )కి నామినేషన్ వేళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్టైల్ లో ఘన స్వాగతం పలికారు. కళాకారుల వాయిద్యాలు, నృత్యాలమధ్య కార్యకర్తలు.. నాయకుల జయజయధ్వనాల మధ్య వియ్యంకుడికి స్వాగతం పలికి ర్యాలీగా కలెక్టరేట్ ప్రాంగణానికి తోడ్కొని వెళ్ళారు. నామినేషన్ అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. రఘురాం రెడ్డి గెలుపుకు పొంగులేటి కృషి చూసి ప్రత్యర్థులకు గెలుపుపై ఆశలు గల్లంతవ్వడమే కాకుండా, ప్రజల్లోను కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి మనిషనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్లయింది.

Leave A Reply

Your email address will not be published.