Read News in Telugu Language
adsdaksha

బిఆర్ఎస్ అహంకారానికి కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్ ..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 6

– గడప గడపకు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో పొంగులేటి

బీఆర్ఎస్ ( brs ) నాయకుల అహంకారానికి కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ ( congress) ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( ponguleti srinivas reddy )  వ్యాఖ్యనించారు. ఖమ్మం ( khammam ) నియోజకవర్గ స్థాయి గడప గడపకు కాంగ్రెస్ ( gadapa gadapaku congress) పార్టీ ప్రచార కార్యక్రమం బుధవారం ఖమ్మం మూడవ డివిజన్ నుంచి ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా పొంగులేటి తొలుత స్థానికంగా ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నియోజకవర్గ నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే సంక్షేమ పథకాలను గురించి వివరించారు. అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ, అందరి చూపు ఇప్పుడు కాంగ్రెస్ వైపే ఉందని, రాష్ట్రం యావత్తు హస్తం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు.

Hospital

read also : బిఆర్ఎస్ పార్టీ కి ఒక్క నియోజక వర్గంలో సోషల్ మీడియా వర్కర్ లు ఎంతమందో తెలుసా..

రూ.500లకే వంట గ్యాస్, రూ. 5లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం, రెండు లక్షల రైతు రుణమాఫీ ఇంకా అనేక సంక్షేమ పథకాలు అందుబాటులోకి రావాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని పొంగులేటి అన్నారు. ప్రజల ఆశీస్సులు, దీవెనలతో ఖచ్చితంగా కాంగ్రెస్ దే అధికారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొంగులేటితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, జిల్లా నాయకులు మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, నగర అధ్యక్షుడు మహ్మద్ జావేద్, కార్పొరేటర్ లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మలీదు వెంకటేశ్వర్లు, మలీదు జగన్, ముస్తాఫా, కొప్పెర ఉపేందర్, ఓబీసీ నగర అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, షేక్ ఇమామ్, దుంపల రవికుమార్, బోడా శ్రావణ్ కుమార్, గుడిపూడి రజనీకాంత్, కాంపాటి వెంకన్న, కీసర పద్మజా రెడ్డి, కొంగర జ్యోతిర్మయి, శ్రీ కళా రెడ్డి, బాణోత్ జ్యోత్స్న, ఆరీఫ్, కె. చంద్రశేఖర్, చల్లా రామకృష్ణ రెడ్డి, రాధాకృష్ణ, మొగిలిచర్ల సైదులు, ఉపేందర్, హెచ్. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

read also : damini : దామిని యాప్ పై అవగాహన కల్పించండి.. కలెక్టర్ వి.పి. గౌతమ్..

Leave A Reply

Your email address will not be published.