Read News in Telugu Language
adsdaksha

పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన పారా సాయి ఉదయ్ కిరణ్ ..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 2

యువతకు ప్రాధాన్యత కల్పించడంలో కాంగ్రెస్ ( congress )  పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలంగాణ ( telangana ) కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మెన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( ponguleti srinivas reddy ) అన్నారు. ఖమ్మం ( khammam )  నగరానికి చెందిన పారా సాయిఉదయ్ కిరణ్ ( para sai uday kiran ) తో పాటు అతని యూత్ సభ్యులు సుమారు 200 మంది పొంగులేటి క్యాంపు కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి వారిని పార్టీలోకి పొంగులేటి ఆహ్వానించారు.

Hospital

read also : అహింసా సిద్దాంతాన్ని చాటి చెప్పిన మహనీయులు మహాత్మాగాంధీ ..

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన అనతి కాలంలోనే బ్యాక్ లాగ్ పోస్టులన్నింటిని భర్తీ చేస్తామన్నారు. పార్టీలో చేరిన పారా సాయి ఉదయ్ కిరణ్ తో పాటు అతని అనుచరులకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా యువకులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం యూత్ సభ్యులు పొంగులేటిని భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు.

 

Leave A Reply

Your email address will not be published.