Read News in Telugu Language
adsdaksha

ఖమ్మం లో బిఆర్ఎస్ కి బిగ్ షాక్..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 15

మాజీ ఎమ్మెల్సీ సహా ఐదుగురు కార్పొరేటర్ లు కాంగ్రెస్ లోకి జంప్..

క్యూలో మరో 15 మంది..

అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల వేళ.. కారు కు భారీ కుదుపు..

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక వైపు బిఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసి అభ్యర్థులకు బి ఫామ్ లు అందిస్తుంటే.. మరో వైపు ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) ఇలాకాలో పార్టీ ఫిరాయింపుల పర్వం జోరందుకుంది. బిఆర్ఎస్ ( brs) అసంతృప్త నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గరినుండి బిఆర్ఎస్ నేతల్లో పక్క చూపులు మొదయ్యాయి. కాంగ్రెస్ ( congress ) లో తుమ్మల చేరికతో చాపకింద నీరులా ప్రజా ప్రతినిధుల నుండి కార్పొరేటర్లు కింద స్థాయి నాయకులు కార్యకర్తలు తమ అభిమాన నాయకుల బాటలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ ( balasani lakshmi narayana ) బిఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు బయటికి వచ్చిన లేఖ చర్చనీయాంశం అయింది. అదే సమయంలో ఢిల్లీ నుండి వచ్చిన కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( ponguleti srinivas reddy ), తుమ్మల నాగేశ్వరరావు ( thummala nageswararao ) బాలసాని ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. అందుకు సుముఖత వ్యక్తం చేసిన బాలసాని ఆదివారం మధ్యాహ్నం తుమ్మలతో సహా పొంగులేటి ఇంటికి విందుకి హాజరయ్యారు.

Hospital

పువ్వాడకు బిగ్ షాక్..

మంత్రి పువ్వాడ ఇలాకాలో బాలసాని బాటలో ఖమ్మం బిఆర్ ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బాలసాని రాజీనామా లేఖ బయటికొచ్చిన కొద్దిసేపటికే కార్పొరేటర్ లు ఒక్కొక్కరిగా పుట్టలోనుండి వచ్చే చీమల్లా కాంగ్రెస్ లోకి బారులు తీరారు. అయితే ధైర్యం చేసి వెంటనే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన వారు కొందరైతే, మరికొందరు ఒకటి రెండు రోజుల్లో బయటికి రాబోతున్నట్లు సమాచారం.

read also : హెచ్‌సీఏ ఎన్నిక‌ల సంగ్రామంలో జ‌గ‌న్‌మోహ‌న్ రావు ..

ఖమ్మం బిఆర్ఎస్ మాజీ నగర అధ్యక్షుడు కమర్తపు మురళిని ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు కొత్తగా పార్టీలో చేరిన బాలసానితో కలిసి ఆయన నివాసంలో కలిశారు. అందుకు కమర్తపు మురళి సానుకూలంగా స్పందించారు. అనంతరం మరో కార్పొరేటర్ చావా నారాయణరావు వీరి ఆధ్వర్యం లో కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. కార్పొరేటర్లు తోట రామారావు, సైదాబాబు సహా మరో 15 మంది కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్లు సమాచారం.

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్సీ సహా ఖమ్మం కార్పొరేటర్లు అడుగుపెట్టిన సందర్భంగా పొంగులేటి క్యాంప్ కార్యాలయం లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు  చావా నారాయణ రావు, కమర్తపు మురళి, సైదాబాబా, ఏలూరి శ్రీనివాసరావు, చేతుల నాగేశ్వరరావు మాట్లాడుతూ  గతంలో తాము టిడిపి లో మాజీ మంత్రి తుమ్మల శిష్యులుగా పనిచేశామని ఆయన లేని బిఆర్ఎస్ లో ఇమడలేక తుమ్మల, పొంగులేటి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించేందుకు కృషి చేస్తామని ఏక కంఠంతో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.