Read News in Telugu Language
adsdaksha

తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే..

దక్ష న్యూస్, సత్తుపల్లి: ఖమ్మం 12

డిసెంబర్ 9 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పాలన..

– సత్తుపల్లిలో కొండూరు పాదయాత్ర ముగింపు సభలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ( congress ) ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, కచ్చితంగా సత్తుపల్లి ( sattupalli ) ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని తెలంగాణ ( telangana ) కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivasa reddy )  ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆకాంక్షిస్తూ సత్తుపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు కొండూరు సుధాకర్ ( konduru sudhakar ) నిర్వహించిన ప్రజా పాదయాత్ర గురువారం ముగిసింది. తల్లాడ నుంచి సత్తుపల్లి వరకు ఐదు మండలాల్లో ఎనిమిది రోజుల పాటు 140కి.మీ.లు కొనసాగిన ఈ పాదయాత్ర బహిరంగ సభకు పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు సాయంత్రం పట్టణంలో కొనసాగిన యాత్రలో నడిచి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, డిసెంబర్ 9న తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు.

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చి చూపుతాం అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వృద్ధులకు, మహిళలకు, రైతు సోదరులకు, నిరుద్యోగులకు ఇందిరమ్మ రాజ్యంలో న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఆత్మ గౌరవాన్ని కాపాడాలని భావించి సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని, మీ ఓట్లతో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి వచ్చేలా చూడాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని ప్రకటించారు.

Hospital

read also : హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి దశదిన కర్మకు హాజరయిన జిల్లా ఎస్పీ వినీత్..

ప్రజలకు ఆశలు పెట్టి.. ఇప్పుడు కోడ్ సాకు…

దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్, గృహ లక్ష్మి ఇలా ప్రజలకు అనేక రకాల ఆశలు పెట్టి ఇప్పుడు కోడ్ అడ్డు వచ్చింది అంటూ వదిలేశారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారని, ఈ ఐదేళ్ల పాటు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీ చెప్పిన మాట చెప్పకుండా మోసం చేసిందని విమర్శించారు. అధికార మదంతో అధికార పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడిన తీరు ప్రజలు గమనించారని, వారి అహంకారానికి పరాకాష్టకు ఆ మాటలే నిదర్శనమని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో యాదవ కులస్థులకు న్యాయం చేస్తాం అన్నారు.

read also : పల్లా జాన్ రాములు జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం..

మీ స్థానిక ఎమ్మెల్యే కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోరని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నేతలకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారని, వారి మాయ మాటలు నమ్మవద్దన్నారు. సత్తుపల్లిలో బిఆర్ఎస్ నేతల అరాచకాలు ఎక్కువయ్యాయని, వారు అధికార మదంతో విర్రవీగుతున్నారన్నారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పరాభవం తప్పదని ఎద్దేవా చేశారు. సత్తుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి కనివిని ఎరుగని రీతి మెజార్టీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఇందిరమ్మ రాజ్యంలో సత్తుపల్లిని జిల్లా చేస్తాం అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభయమిచ్చారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్థానికులకే సింగరేణి ఉద్యోగాలని అన్నారు. నియోజక వర్గంలోని ప్రతి మండలంలో అర్హులు అయిన ప్రతి ఒక్కరికీ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయిస్తామని, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.