Read News in Telugu Language
adsdaksha

అందరికీ అండగా నిలుస్తాం : రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి..

దక్ష న్యూస్, ఖమ్మం: ఏప్రిల్ 30

కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, ప్రజలందరికీ రఘురాం రెడ్డి అండగా నిలుస్తారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( ponguleti srinivasareddy ) అన్నారు. మంగళవారం కవిరాజ్ నగర్ లో మహావిష్ణు బిల్డర్స్, కాంపాటి పిచ్చయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి తో కలిసి మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఖమ్మం సీటును, రాష్ట్రంలోని అన్ని సీట్లను గెలిపించుకొని సోనియమ్మకు కానుకగా ఇద్దాం అన్నారు. ఇందుకోసం నాయకులు విశేష ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Hospital

రాబోయే ఐదేళ్లు నేను మీతోనే : రఘురాం రెడ్డి..

రాబోయే ఐదేళ్లు నేను మీతోనే ఉంటానని, భారీ విజయాన్ని అందించాలని ..సీపీఐ, సీపీఎం బలపర్చిన కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ( ramasahayam raghuram reddy) అన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని ఓ హోటల్ లో నిర్వహించిన పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం లో మాట్లాడారు. సీనియర్, యువ నాయకుల సమష్టి కృషితో ముందుకు పోదాం అన్నారు. ఘన చరిత్ర ఉన్న మన జిల్లా ప్రజలకు సేవ చేసేందుకు ఈ ఐదేళ్లు పూర్తిగా ప్రజలతోనే ఉంటానని తెలిపారు.

జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి నేతృత్వంలో పనిచేస్తా అని రఘురాం రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణ కుమారి, నాయకులు తుమ్మల యుగేoదర్, సాధు రమేష్ రెడ్డి, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, బాల గంగాధర్ తిలక్, దీపక్ చౌదరి, కొత్తా సీతారాములు, ఎండీ.ముస్తఫా, చోటే బాబా, వద్దెబోయిన నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.