Read News in Telugu Language
adsdaksha

భారత రాజ్యాంగాన్ని మార్చే బీజేపీ మనకొద్దు : సత్తుపల్లి రోడ్ షోలో మంత్రి పొంగులేటి ..

దక్ష న్యూస్, సత్తుపల్లి : మే 5

సాయి వెంకట్ మొగుదుంపురం, నెట్ వర్క్ ఇన్ చార్జ్ : దక్ష న్యూస్

ఈ లోక్ సభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను మార్చాలనీ బీజేపీ కుట్ర చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivasareddy ) అన్నారు. శనివారం రాత్రి సత్తుపల్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి రోడ్ షో నిర్వహించి, కార్నర్ మీటింగ్ లలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దళిత, గిరిజన, మైనారిటీ, బడుగు వర్గాల వారు ప్రమాదంలో పడిపోతారని, అలాంటి సర్కారు మనకొద్దని అన్నారు. ఈ పదేళ్లలో మన రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని పొంగులేటి తెలిపారు. కులాల మధ్య, ప్రాంతాల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ.. పాలన సాగిస్తున్నారన్నారు.

read also : ఖమ్మం జిల్లా రాజకీయాలు రాష్ట్రానికే దిక్సూచి.. ఇక్కడి నాయకులు రాజకీయాల్సే శాసించగల దిట్టలు : సీఎం రేవంత్ రెడ్డి..

Hospital

ప్రజా సంక్షేమ పాలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం అని పొంగులేటి అన్నారు. ఇక కర్ర పట్టుకుని కేసీఆర్ జనం లోకి వస్తున్నారనీ, ఆయనను నమ్మే రోజులు ఎప్పుడో పోయాయని విమర్శించారు. అక్రమంగా సంపాదించిన లక్షా యాభై వేల కోట్లను దాచుకునేందు కేంద్ర ప్రభుత్వం తో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నాడని పొంగులేటి ఆరోపించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళను కేటాయిస్తామని ప్రకటించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటేసి రఘురాం రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

read also : రఘురాం రెడ్డిని ఆదరించి.. కాంగ్రెస్ కే జై కొడదాం : సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి..

లంకా సాగర్ కు గోదావరి జలాలను తీసుకొస్తాం: మంత్రి తుమ్మల

స్థానిక లంకాసాగర్ కు గోదావరి జలాలను తీసుకొచ్చి, ఇక్కడి రైతుల వ్యవసాయ భూములకు నిరందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. రఘురాంరెడ్డిని ఎంపీగా గెలిపించి.. ఢిల్లీకి పంపుదామని, జాతీయస్థాయిలో సమస్యలు పరిష్కరించుకుందామని అన్నారు.
బీజేపీ, బీ ఆర్ ఎస్ లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తుమ్మల తెలిపారు. అందరూ హస్తం గుర్తుపై ఓటు వేసి.. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఖమ్మం ఎంపీ స్థానానికి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.