Read News in Telugu Language
adsdaksha

36 మెట్రిక్ టన్నుల ధాన్యం ను ఇప్పటికే కొనుగోలు చేసాం : సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…

దక్ష న్యూస్, హైదరాబాద్ : మే 20

36 మెట్రిక్ టన్నుల ధాన్యం ను ఇప్పటికే కొనుగోలు చేశామని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivasareddy ) అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 3 రోజుల లోపే రైతు ల ఖాతాలో నగదు జమ చేశామన్నారు. ఎమ్మెస్పీ ధరకే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లకు క్వింటా కు 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

సోమవారం కేబినేట్ సమావేశం అనంతరం పొంగులేటి మాట్లాడుతూ, నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అమ్మ ఆదర్శ కమిటీ ల ద్వారా పాఠశాల మెయింటెనెన్స్ చేస్తామని, పాఠశాల లో మౌళిక వసతుల కల్పనకు, విద్యా వ్యవస్థ లో మార్పులకు శ్రీధర్ బాబు కమిటీ వేశాం అన్నారు. అన్నారం ,సుంధిళ్ళ ,మెడిగడ్డ బ్యారేజ్ లలో నీటి నిల్వ చేయకూడదని ఎన్డీఎస్ ఎ రిపోర్ట్ ఇచ్చిందన్నారు.

read also : అర్హులందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు అందజేస్తాం : రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి..

Hospital

బ్యారేజ్ ల సేఫ్టీ పై ఎక్స్ పర్ట్ కంపెనీలతో పరిశీలన చేయించి రిపోర్ట్ తీసుకోనున్నట్లు పొంగులేటి తెలిపారు. ఆ రిపోర్ట్ ఆధారంగానే మరమ్మతులు చేపడుతాం అన్నారు. తక్కువ ఖర్చుతో నీటి ని లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటే పరిశీలించాలని కేబినేట్ నిర్ణయించినట్లు వెల్లడించారు.

read also : ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పై సన్నాహక సమావేశం .. హాజరు కానున్నమంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న..

జూన్ 2 కు తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సభకు సోనియా గాంధీ తో పాటు తెలంగాణ ఏర్పాటు కు కృషి చేసిన వారిని ఆహ్వానిస్తామని, వేడుకల నిర్వహణ కు ఈసీ కి లేఖ రాయాలని నిర్ణయించామన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.