Read News in Telugu Language
adsdaksha

పొంగులేటి అభిమానులకు మలయ మారుతం లాంటి వార్త..నేటి నుండి జిల్లాలో శ్రీనివాసరెడ్డి పర్యటన ..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 30

మండే ఎండల్లో శీనన్న అభిమానులకు మలయమారుతం లాంటి న్యూస్. ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivasareddy) గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. అంతే కాదు శుక్రవారం నుండి ఆయన తన చుట్టూ ఉన్న నాయకులు కార్యకర్త లతో కలిసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
దాంతో విషయం తెలిసిన పొంగులేటి కేడర్ లో జోష్ కనిపిస్తోంది.

Read also: విక్రయ కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగు పరచండి : అధికారులకు కలెక్టర్ ఆదేశాలు..

Hospital

తిరుమలాయపాలెం మండలంలో..

తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తిరుమలాయపాలెం మండలంలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

పర్యటనలో భాగంగా మండలంలోని కొక్కిరేణి, ఎర్రగడ్డ, గోపాలపురం, తిమ్మక్కపేట, తాళ్లచెర్వు, బీరోలు, ఏలువారి గూడెం, బంధంపల్లి, బచ్చోడుతండా, సోలిపురం, రాజారామ్, పైనంపల్లి, జూపెడ, కాకరవాయి, సుద్దవాగుతండా, ముజాహిద్ పురం , ఏనుకుంట తండా, మంగళిబండతండా, రఘునాథపాలెం గ్రామాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు నేరుగా మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని దయాకర్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.