Read News in Telugu Language
adsdaksha

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం : నేలకొండపల్లి పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..

దక్ష న్యూస్, ఖమ్మం: జూన్ 3

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( ponguleti srinivasareddy ) భరోసా ఇచ్చారు. నేలకొండపల్లి మండలంలో సోమవారం తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా కొత్త కొత్తూరు, మంగాపురం తండా, రాయగూడెం, అప్పలనరసింహాపురం, కొంగర, కట్టుకాచారం, బుద్దారం, చెరువుమదారం, రాజారాంపేట, అజయ్ తండా, భైరవునిపల్లి, తిరుమలపురం, పైనంపల్లి, రామచంద్రాపురం, సుర్దేపల్లి, పాత కొత్తూరు, చెన్నారం గ్రామాల్లో పర్యటించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

Read also: జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలి : టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం న్యాయమైన కోరికలు అన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఏడాదిలోపు పాలేరులోని అన్ని గ్రామాల్లో సీసీరోడ్లు పూర్తి చేస్తామని తెలిపారు. రూ.22.5 కోట్ల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రోహిణి కార్తెలోనే వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. అనేక కష్టాలు, నష్టాలు పడి తనను మంచి మెజారిటీతో గెలిపించారని, ప్రజలు ఇచ్చిన అవకాశంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని వెల్లడించారు.

Hospital

Read also: లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కి సర్వం సిద్దం.. స్ట్రాంగ్ రూం ఉదయం గం. 5కే ఓపెన్ : జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్..

పార్లమెంట్ ఎన్నికల్లో పాలేరు నుంచి అత్యధిక మెజారిటీ రాబోతోందని పొంగులేటి చెప్పారు. గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదవారికి ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదని, అర్హులైన వారికి ఆసరా పెన్షన్ కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. ఓడిపోయిన విషయాన్ని మరిచి బీఆర్ఎస్ నేతలు ఇంకా అహంకార ధోరణి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కల్లబొల్లి మాటలతో ఇంకా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

పదేళ్ల పాటు పేదలను విస్మరించిన బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదని పొంగులేటి మండిపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఆయన వెంట పర్యటనల్లో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.