Read News in Telugu Language
adsdaksha

రఘురాంరెడ్డిది ఆల్ టైం రికార్డు : కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మంత్రి పొంగులేటి..

దక్ష న్యూస్, ఖమ్మం : జూన్ 4

గతంలో ఎప్పుడూ కనీవిని ఎరుగని రీతిలో ఖమ్మం లోక్ సభ ఎంపీగా రామ సహాయం రఘురాం రెడ్డి ని 4.67లక్షల ఆల్ టైం రికార్డు మెజారిటీని అందించిన ఉభయ జిల్లాల ప్రజలకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivasareddy) మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ వద్ద గల కిట్స్ కళాశాల లోని కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా సమావేశంలో రఘురాంరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి పొంగులేటి మాట్లాడారు. 18 వ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఖమ్మం రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని అన్నారు.

Read also: చరిత్ర సృష్టించాలన్నా…. దాన్ని తిరగ రాయాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..

ఖమ్మంలోని ఐదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
ఖమ్మం పార్లమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి ఇంత మెజారిటీ ఎప్పుడూ రాలేదని అన్నారు. రాష్ట్రం లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది సీట్లు అందించారని, హైదరాబాద్ మొదటి నుంచి ఎంఐఎం సోదరులు గెలుస్తారనీ తెలిపారు.
గడిచిన అసెంబ్లీ ఎన్నికల కంటే 1.67 శాతం అధికంగా ఓట్లు నమోదయ్యయని అన్నారు.

Hospital

బీఆర్ ఎస్, బీజేపీలది అంతర్గత ఒప్పందం..

రాష్ట్రం లో బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను పెట్టి ఓట్లు బీజేపీకి పడేలా చేసిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. అంతర్గతంగా చేసుకున్న ఒప్పందం తోనే 8 సీట్లు గెలవగలిగారని తెలిపారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక లో కూడా కాంగ్రెస్ అభ్యర్ధి ని గెలిపించినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందాం..

ప్రజాస్వామ్యన్ని కాపాడుకోవాలంటే ఈ సారి ఇండియా కూటమి కి మద్దతు ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో దేశ రాజకీయలు మలుపు తిరుగుతాయని అన్నారు.
ఒంటరిగానే కేంద్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న బీజేపీ వారి అహంకారానికి ప్రజలు పుల్ స్టాప్ పెట్టారని అన్నారు. దేశంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న వారు మరోసారి పునరాలోచించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.