Read News in Telugu Language
adsdaksha

దొరని గడీలోనే బంధించి రాజకీయ సమాధి చేయాలి…

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 23

– పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

దొరని గడీలోనే బంధించి శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలని పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivas reddy ) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండలంలోని ముజ్జుగూడెం, అనాసాగరం, కొత్త కొత్తూరు తిరుమలపురం, పైనంపల్లి రామచంద్రపురం, సుర్దేపల్లి మడ్రాజుపల్లి చెన్నారం బోదుల బండ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ… సాధించుకున్న తెలంగాణా లో కేసీఆర్ ప్రజల సొమ్ము దోచుకుంటున్నాడన్నారు. దొరని గడీలోనే బంధించి శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలని పిలుపునిచ్చారు.

Read also : పొంగులేటి కి మద్దతుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ మీడియా సమావేశం..

Hospital

ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరం లోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని పొంగులేటి అన్నారు. అలాగే పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన సన్నబియ్యం అందిస్తుందన్నారు. కేసీఆర్ దోపిడీని రోజూ ప్రశ్నిస్తున్నామని రేవంత్ రెడ్డిని, నన్ను ఓడించడానికి కేసీఆర్ డబ్బుల సంచులు పంపిస్తున్నాడన్నారు. ఆ డబ్బును మీరు తీసుకొని ఓటు మాత్రం హస్తం గుర్తుకు ఓటేసి మీ గుండెల్లో ఉన్న శ్రీనన్న ను గెలిపించలన్నారు.

 

Read also : theenmar mallanna : గూడేల్లో కేసీఆర్ ఎయిర్ అంబులెన్సులు ఏమయ్యాయి.. తీన్మార్ మల్లన్న..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిషరిస్తామని పొంగులేటి తెలిపారు. డిసెంబర్ తొమ్మిది న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడన్నారు. అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.