Read News in Telugu Language
adsdaksha

2న జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన..

దక్ష న్యూస్, ఖమ్మం: జనవరి 1

– పాలేరు నియోజకవర్గం ప్రజాపాలన సభలకు హాజరు..

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( ponguleti srinivasreddy ) మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారని పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ( tumburu dayakar reddy ) ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 08:30గంటలకు పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం ( khammam ) రూరల్ మండలం మంగళగూడెంలో, ఉదయం 09:45 గంటలకు తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ప్రజా పాలన కార్యక్రమాల్లో పాల్గొననున్నారని వెల్లడించారు.

Hospital

read also : 2 నుంచి 6 వరకు యథావిధిగా ప్రజాపాలన గ్రామసభలు..

ఉదయం 11 గంటలకు ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో మార్కెట్ యార్డు, జేఎన్టీయూ కళాశాల స్థలాలను పరిశీలిస్తారని దయాకర్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. తిరిగి మధ్యాహ్నం 2:45 గంటలకు మంగాపురం తండాలో, సాయంత్రం 4:30 గంటలకు కూసుమంచి మండలం ముత్యాలగూడెంలో జరిగే ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొంటారని దయాకర్ రెడ్డి వెల్లడించారు.

read also : ఖమ్మం జిల్లాలో నేటి ప్రజాపాలన షెడ్యుల్ ఇదే..

Leave A Reply

Your email address will not be published.