Read News in Telugu Language
adsdaksha

రేపు పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన ..

దక్ష న్యూస్, ఖమ్మం : మార్చి 15

తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivasreddy ) శనివారం పాలేరు (paleru ) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ( dayakar reddy ) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9:30గంటలకు మంత్రి పొంగులేటి కూసుమంచి లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10గంటలకు జీళ్లచెర్వులో సీసీ రోడ్లను ప్రారంభిస్తారని దయాకర్ రెడ్డి తెలిపారు. ఉదయం 11గంటలకు నేలకొండపల్లి మండలం చెన్నారంలో ఆర్అండ్ బీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అక్కడే కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.

Hospital

read also : ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం – వంద రోజుల పాలనపై రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి ..

మధ్యాహ్నం 12గంటలకు చెర్వుమాదారంలో సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారని, ఒంటిగంటకు కైకొండాయిగూడెంలో సీసీరోడ్లకు, డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు మహబూబాబాద్ లో జరిగే మహబూబాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని మంత్రి పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.