Read News in Telugu Language
adsdaksha

పాలేరు నా సొంత ఇల్లు.. మూడేళ్ళలోనే అర్హులందరికీ సంక్షేమ పథకాలు..

దక్ష న్యూస్, ఖమ్మం : జూన్ 1

పేదల ప్రభుత్వం లో ప్రజలు కోరిన కోరికల్లో అన్నింటినీ నెరవేర్చడానికి కృషి చేస్తానని తెలంగాణ ( telangana ) రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి ( minister ) పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivasreddy ) అన్నారు. శనివారం ఖమ్మం ( khammam ) రూరల్ లో పర్యటించిన ఆయన పలు గ్రామాలను సందర్శించి తనను గెలిపించి మంత్రిని చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే ప్రజా ప్రభుత్వన్ని తెచ్చుకున్నారన్నారు. పేదవారికి అవసరమైన రెండు పోర్టు పొలియోల్లో తానున్నానని తప్పకుండా ప్రజల రుణం తీర్చుకుంటా అన్నారు.

read also : 3న దొడ్డి కొమురయ్య చిత్ర నిర్మాణ కమిటీ ప్రకటన : భద్రు నాయక్..

గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో పేదవారి కలలు కలలు గానే మిగిలాయని పొంగులేటి అన్నారు. పాలేరు ( paleru ) నియోజకవర్గం నా సొంత ఇల్లని, మీ రుణం తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడన్నారు. సంవత్సరంలో నే పాలేరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేయిస్తా అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం లో పేరు అడ్డంపెట్టుకుని సంస్థలకు ఆస్తులు పోయాయి. ప్రభుత్వ ఆస్తుల చుట్టూ ప్రహరీ కట్టించి వాటిని రక్షిస్తాం అన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఇళ్ళు పూర్తి చేస్తే పాలేరు ప్రజలకు మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేయడమే నా లక్ష్యం అన్నారు.

ప్రభుత్వ స్థలాలు అన్నీ బయటకు తీయించి అర్హులైన వారికి ఆ స్థలాలు కేటాయిస్తామని పొంగులేటి తెలిపారు. గడిచిన పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. తప్పకుండా మీ కష్టాలలో పెద్ద కొడుకుగా ఉండి పనిచేస్తా అన్నారు.

Hospital

read also : టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర మహాసభల వెబ్ సైట్ ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి ..

రాష్ట్ర ప్రజలకు పొంగులేటి శుభకాంక్షలు..

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  తెలంగాణ ప్రజల అరవయ్యేండ్ల ఆకాంక్షలను అర్థం చేసుకొని … విశ్వసనీయత కు పట్టం కట్టి, తెలంగాణ ప్రజల దశాబ్దాల కలలను సాకారం చేసి..తెలంగాణ రాష్ట్రాన్ని జూన్ 2వ తేదీ 2014న మొక్కవోని దీక్ష తో ఆవిష్కరించిన తెలంగాణ తల్లి సోనియమ్మకు, తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అన్నారు. పది సంవత్సరాల తరువాత ప్రజలు కోరుకున్న, ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.