Read News in Telugu Language
adsdaksha

కేసిఆర్ ప్రజలు సంతలో గొర్రెలు కాదు : పొంగులేటి

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 7

నన్ను ఓడించేందుకు రూ.100కోట్లు కందాలకు పంపించావ్ ..

ప్రజల దగ్గర దోచుకున్నదాన్నే వారికి తిరిగి పంచుతున్నావ్..

ఖమ్మం రూరల్ మండల ఎన్నికల ప్రచారంలో పొంగులేటి..

Hospital

ప్రజలను సీఎం కేసీఆర్ ( cm kcr ) సంతలో గొర్రెల్లా భావిస్తున్నాడని పాలేరు ( paleru )  నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivasreddy ) అన్నారు. కానీ ప్రజలకు ఎవరిని నమ్మాలో… ఎవరి పక్షాన ఉండాలో తెలుసన్నారు. మంగళవారం ఆయన ఖమ్మం ( khammam ) రూరల్ మండలంలోని గొల్లగూడెం, బారుగూడెం, ఆరెంపుల, చింతపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ… ఓట్లు అభ్యర్థిస్తూ… కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను వివరిస్తూ ముందుకు సాగారు. ప్రతి గ్రామంలోనూ పొంగులేటికి ఘనస్వాగతం లభించింది. సీపీఐ ( cpi ) శ్రేణులు కూడా కాంగ్రెస్ కు మద్దతుగా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

read also : కాంగ్రెస్ మూడో జాబితా వచ్చేసింది .. కామారెడ్డి బరిలో రేవంత్‌రెడ్డి ..

ఆయా గ్రామాల్లో పొంగులేటి ప్రసంగిస్తూ నన్ను ఓడించేందుకు కేసీఆర్ కందాల ఉపేందర్ కి రూ.100 కోట్లు పంపించాడని ఆరోపించారు. ప్రజల దగ్గర దోచుకున్నదాన్నే వారికి తిరిగి పంచేందుకు బీఆర్ఎస్ సిద్ధమయిందని దుయ్యబట్టారు. లక్ష కోట్లు దోచుకున్నా నామ మాత్రపు సొమ్మును ప్రజలకు పంచుతున్నారని ఆరోపించారు. అవి ప్రజలవేనని వాటిని తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి దీవించాలని కోరారు. శీనన్నగా నన్ను ఎంతగా అభిమానిస్తున్నారో… అంతకు మించిన ఆధారాభిమానాలు వారిపై తనకు ఉన్నాయని ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఐ నాయకులు రాయల నాగేశ్వరరావు, మద్దినేని బేబి స్వర్ణకుమారి, కల్లెం వెంకట్ రెడ్డి, మద్ది మల్లా రెడ్డి, బండి జగదీష్, బైరు హరినాథ్ బాబు, కన్నెటి వెంకన్న, గరిక పాటి వెంకట్రావ్, శివా రెడ్డి, చింతమళ్ల పద్మ, ముత్యం చిన్న కృష్ణారావు, మాదాల తిరుపయ్య, సత్తి ఉప్పలయ్య, మారుతి వెంకన్న, ధనియాకుల మహేష్, మల్లిఖార్జున్, మారుతి ఉపేందర్, భట్టా బాబు, చింతమళ్ల రవి, బండి విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.