Read News in Telugu Language
adsdaksha

25 రోజులు కష్టపడితే వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే…

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 8

– కాళేశ్వరం ప్రాజెక్టు పై నివేదిక ఇచ్చినా ఎందుకు మౌనంగా ఉన్నారు..

– మాజీ ఎంపీ, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఇంకా 25 రోజులు కష్టపడితే వచ్చేది మన రాజ్యమే.. ఇందిరమ్మ రాజ్యమే అని మాజీ ఎంపీ, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivas reddy ) అన్నారు. బుధవారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Hospital

ఎవరు ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా, కేసులు నమోదు చేసినా కాంగ్రెస్ పార్టీలో భయపడే వారు ఎవరు లేరని శ్రీనివాసరెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటకు వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని ప్రశ్నించారు‌.

read also : రఘునాథపాలెం మండలం లో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ..

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజలకు గొప్పలు చెప్పిన రూపశిల్పి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి పై దర్యాప్తు సంస్థలు నివేదికలు ఇచ్చిందని, అందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో ప్రజలకు చెప్పాలని శ్రీనివాసరెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు, వరదలు వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఉందని నివేదికలో ఉందన్నారు. ఇంత ప్రమాదం ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

రేపు కాళేశ్వరం ప్రాజెక్టు తో ప్రజల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన తర్వాత స్పందింస్తారా అంటూ పొంగులేటి ప్రశ్నించారు‌. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బోర్డర్లో సైనికులవలె పని చేయాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.