Read News in Telugu Language
adsdaksha

డీడీలు కట్టిన ప్రతి యాదవ కురుమలకు గొర్రెలు ఇప్పిస్తాం …

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 11

నమ్మకద్రోహం చేసిన కెసిఆర్ ను గద్దె దించాలి : పొంగులేటి

డీడీలు కట్టించుకుని నమ్మకద్రోహం చేసిన కెసిఆర్ ను యాదవ కురుమలు గద్దె దించాలని కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( ponguleti srinivasreddy ) అన్నారు. ఎన్నికలలో కాంగ్రెస్ ( congress ) పార్టీ విజయం ఖాయమని, డీడీలు కట్టిన యాదవ కురుమలందరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజులలో గొర్రెలు ఇప్పిస్తామని, సమస్యలను అన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో కూసుమంచిలో శనివారం పాలేరు నియోజకవర్గం స్థాయి యాదవ కురుమల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాణం పోయినా మాట ఇస్తే కట్టుబడి ఉండే నమ్మకమైన యాదవ కురుమలు రాష్ట్రవ్యాప్తంగా 8135 సంఘాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు.
354,791 మంది లబ్ధిదారులకుగాను 1,20,000 మందితో , ఖమ్మం జిల్లాలో దాదాపు 11,000 మంది లబ్ధిదారుల వద్ద డీడీలు కట్టించుకుని గొర్రెలు ఇస్తానని నమ్మకద్రోహంతో మోసం చేసిన కెసిఆర్ మోసం చేశాడని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశాడన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ ప్రకటనలు లేక నిరుద్యోగులు, గిట్టుబాటు ధర లేక కౌలు రైతులు, వ్యాపారస్తులు, చివరకు బిఆర్ఎస్ పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు సర్పంచులు కూడా, చేసిన పనులకు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.

Hospital

read also : కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ లో అదిరిపోయే హామీలు..

కళకళలాడే తెలంగాణను నిలువునా దోచుకుని, రాష్ట్రాన్ని అప్పుల మయంగా, అవినీతిమయంగా మార్చిన కేసిఆర్ ను తప్పక ఓడించాలని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. యాదవ కురుమలకు నియోజకవర్గ స్థాయి లో గొర్రెల మార్కెట్ యార్డు నిర్మించాలని, ఎన్సీడీసీ రుణాలు మాఫీ చేయాలని, గొర్రెలకు బదులు దళిత బంధులాగా అకౌంట్లో నగదు బదిలీ చేయాలని, ఎన్ఎల్ఎం స్కీముకు బ్యాంకు తో సంబంధం లేకుండా నేరుగా రుణాలు ఇప్పించాలని, ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరికి 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇప్పించాలని మల్లి బాబు యాదవ్ డిమాండ్ చేశారు.

read also : కదం తొక్కిన యువం సైన్యం..

కార్యక్రమానికి దాదాపు 5000 మందికి పైగా యాదవ కురుమలు ఆటోలు ట్రాలీలలో తరలివచ్చారు. మల్లి బాబు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో, టీపీసీసీ మెంబర్ నాగ సీతారాములు పుచ్చకాయల వీరభద్రం, వెన్నపూసల సీతారాములు, ఎనికె జానకి రామయ్య, మూడు ముంతల గంగరాజు బమ్మిడి శ్రీనివాస్, దుబ్బాకుల పిచ్చయ్య, దుబాకుల వెంకటేశ్వరరావు, చెన్ను వెంకటరమణ పల్లెబోయిన శ్రీనివాస్, లోడిగ వెంకన్న, పద్ది ఆగమయ్య, దొడ్డి సాంబయ్య, మేకల సైదులు, గూదే భద్రయ్య మెండే వెంకటేష్ బారి వీరభద్రం బారి శ్రీను చిలకల సీతారాములు చిలకల భూషయ్య, తదితర యాదవ ప్రముఖులు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.