Read News in Telugu Language
adsdaksha

నకిరేకల్ లో మంత్రి పొంగులేటికి పౌర సన్మానం.. గజ మాలతో ఘన స్వాగతం..

దక్ష న్యూస్, ఖమ్మం: డిసెంబర్ 17

ఖమ్మం జిల్లాలో పొంగులేటి పర్యటన..

తెలంగాణ ( telangana ) రాష్ట్ర రెవిన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( ponguleti srinivas reddy ) కి ఆదివారం నల్లగొండ ( nalgonda ) జిల్లా నకిరేకల్ ( nakirekal ) లో పౌర సన్మానం అత్యంత ఘనంగా జరిగింది. మంత్రిగా పదవీ భాద్యతలు స్వీకరించిన అనంతరం ఖమ్మం ( khammam ) జిల్లాకు వెళ్తున్న మంత్రికి మార్గం మధ్యలోని నకిరేకల్ లో శాసన సభ్యులు వేముల వీరేశం ( vemula veeresham ) ఆధ్వర్యంలో పౌర సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో నకిరేకల్ నియోజకవర్గంతో పాటు పరిసర నియోజక వర్గాల ప్రజలు హాజరయ్యారు. తమ అభిమాన నాయకుడికి పౌరసన్మానం చేసి ఘనంగా సత్కరించారు.

read also : Ata : జయహో తెలుగు సాహిత్యం…ఘనంగా ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు..

Hospital

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు కురిపిస్తున్న ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సేవలు అందించి అన్ని వర్గాల అభ్యున్నతికి తోడ్పనున్నట్లు పేర్కొన్నారు. తనకు ఓట్లేసి గెలిపించిన పాలేరు నియోజక వర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే పంచాయితీ ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించి సత్తా చాటాలన్నారు.

ఖమ్మం జిల్లాలో సోమవారం తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖలమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 07.00గంటల నుంచి ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ అందుబాటులో ఉంటారు. అనంతరం ఉదయం 09.00గంటల నుంచి 11.00గంటల వరకు ఖమ్మం కలెక్టరేట్లో జరిగే పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 02.00 గంటల వరకు మంత్రి తన క్యాంపు కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉండనున్నట్లు క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.