Read News in Telugu Language
adsdaksha

ప్రజలకు పొంగులేటి నూతన సంవత్సర శుభకాంక్షలు..

దక్ష న్యూస్, ఖమ్మం: డిసెంబర్ 31

నయా జోష్ తో ‘చే’యూతనిస్తాం..!

– కొత్త ఏడాదిలో అర్హులందరికీ ఆరు గ్యారంటీలు

– రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి..

తెలంగాణలోని ప్రతి మహిళ మహాలక్ష్మిగా ఉండాలని… రైతన్నలందరికీ భరోసా ఇవ్వాలని… గృహాలన్నీ ‘ జ్యోతులతో ‘ వెలగాలని… ప్రతీ కుటుంబానికి సొంతింటి కల నెరవేరాలని… అంతర్జాతీయస్థాయిలో విద్యారంగం వికసించాలని…. ఆరోగ్య ధీమా దక్కాలని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులందరికీ ‘చే’యూతనివ్వాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీలు నయా జోష్ తో అర్హుల దరిచేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( ponguleti srinivasreddy ) పేర్కొన్నారు.

Hospital

read also : రేపే పిఎస్ఎల్‌వీ-సీ58 ప్రయోగం.. కౌంట్‌డౌన్ ప్రారంభం ..

తెలంగాణ ( telangana ) ప్రజలందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులెవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పథకాలన్నీ వారి చెంతకే చేరేలా పారదర్శక పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు. నూతన ఏడాదిలో ప్రతీఒక్కరి మోములో చిరునవ్వు చూడాలనేదే కాంగ్రెస్ ( congress ) లక్ష్యమని పేర్కొన్నారు.

read also : డా.కావ్యచంద్ యలమూడి కి ‘వైద్య శ్రీ 2023 అవార్డు ..

రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన..

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 03.00 గంటల వరకు తన స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురంలో, సాయంత్రం 04.00 గంటల నుంచి ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.