Read News in Telugu Language
adsdaksha

ఉప్పొంగిన అభిమానం.. ఎల్లెడలా పొంగులేటి జన్మదిన వేడుకలు..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 24

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivasreddy ) 58వ జన్మదినం సందర్భంగా శనివారం ఖమ్మం ( khammam ) క్యాంపు కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. వందలాది మంది శీనన్న అభిమానులు, కాంగ్రెస్ ( congress ) శ్రేణులు తరలివచ్చి శ్రీనివాసరెడ్డితో కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పూలబొకేలు, పూల మొక్కలు, మెమోంటోలతో సత్కరించారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ పేరుపేరునా శీనన్న కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా నలుమూలలనుండి వచ్చిన అభిమానులతో పొంగులేటి క్యాంపు కార్యాలయం సందడిగా మారింది.

శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన పాట సీడిని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, శీనన్న అభిమాని తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పొంగులేటి శీనన్నపై పాట రాసి సిడిని ఆవిష్కరించారు. సప్త స్వరాల పేరుతో శీనన్న ఔన్నత్యాన్ని అక్షర రూపంలో పొందుపరిచిన జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డిని పొంగులేటి ప్రత్యేకంగా అభినందించారు. అభిమానులు రూపొందించిన మరొక పాటను కూడా పొంగులేటి ఆవిష్కరించారు.

read also : కందాళతో కాదు.. మీరు రండి పాలేరు లో పోటీ చేయడానికి : కేసిఆర్ కి పొంగులేటి సవాల్

జీవన సంధ్యా వృద్ధాశ్రమంలో ..

Hospital

పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని… ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్, పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి 58వ జన్మదిన వేడుకలను ఖమ్మంలోని జీవన సంధ్యా వృద్ధాశ్రమంలో మువ్వా యువసేనా బాధ్యులు సామినేని కృష్ణచైతన్య, పునాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టిన రోజు కేక్ ను కట్ చేశారు. అనంతరం ఆశ్రమంలోని సుమారు 100 మంది వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పాలేరులో మంచి మెజారిటీతో గెలవాలని ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మువ్వా యువసేనా సభ్యులు కొప్పుల చంద్రశేఖర్, మద్ది కిశోర్ రెడ్డి, బోజెడ్ల రవికుమార్, నాగండ్ల బాబు భాస్కర్ చావా వినోద్, వడ్రాణపు కిశోర్, తాళ్లూరి రాజేష్, పసుపులేటి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

read also : కాంగ్రెస్ లోకి భారీ చేరికలు .. హస్తం గూటికి నీలం మధు , మోత్కుపల్లి, నేతి, కపిలవాయి ..

తల సేమియా బాధితుల కోసం..

శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా రెడ్డిపల్లిలో తలసేమియా బాదితులకోసం భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. రెడ్డిపల్లి లోని అమ్మ ఫంక్షన్ హాల్ లో శనివారం వంద మందితో రక్తదానం ఏర్పాటు చేశారు. శీనన్న పై అభిమానంతో
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చి తల సేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఈ రక్తదానం చేశారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు. తొలుత కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా శ్రేణులు జై పొంగులేటి, జై జై పొంగులేటి నినాదాలతో హోరెత్తించారు.

అనంతరం రక్తదానం చేసిన వారిని పొంగులేటి ప్రసాద్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ప్రసాదరెడ్డి మాట్లాడుతూ, శీనన్న పై మీ అభిమానం మరువలేనిదని, ఆయన ఎప్పుడూ మీతోనే ఉంటారని అన్నారు. ఇదే స్ఫూర్తితో, ఉత్సాహంతో పాలేరులో భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. నిర్వాహకులు ముత్తగూడెం సర్పంచ్ గోనె భుజంగరెడ్డి తదితరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, చింతపల్లి సర్పంచ్ ముత్యం చిన్న కృష్ణారావు, తల్లంపాడు సర్పంచ్ శివారెడ్డి, కూర్మా రావు, రవికుమార్ , నాయకులు కిసాన్ సెల్ మండల అధ్యక్షులు కొంపల్లి మహేష్, కన్నీటి వెంకన్న, కొమ్మినేని వెంకటేశ్వర్లు, వీరారెడ్డి, లింగ శ్రీనివాసరావు, అజ్మీరా అశోక్ నాయక్, మద్ది కిషోర్ రెడ్డి, నాగండ్ల శ్రీను, అంబేద్కర్, పంతులు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.