Read News in Telugu Language
adsdaksha

కందాళతో కాదు.. మీరు రండి పాలేరు లో పోటీ చేయడానికి : కేసిఆర్ కి పొంగులేటి సవాల్

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 28

కేసిఆర్ ప్రజాస్వామ్యం అనే పదం పలికే హక్కు మీకు ఉందా..

డబ్బు మూటలతో వస్తారంటుంన్నారు.. మాకు వ్యాపారాలలో సంపాదించిన ధనం ఉంది..

మరి మీకు ఎలా సంపాదించిన ధనం ఉందో చెప్పాలి..

మీ కుటుంబాలకు లక్షల కోట్లు ఎలా వచ్చాయి..

– విలేకరుల సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి..

Hospital

అపద్దర్మ ముఖ్యమంత్రి పాలేరు ( paleru ) నియోజకవర్గంలో నిర్వహించిన సభలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కొందరు డబ్బు మదంతో అహంకారంతో వస్తున్నారనే పదం వాడారని కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivasreddy ) అన్నారు. శనివారం ఖమ్మం ( khammam ) జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాలేరు సభలో కేసిఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి అసలు కేసిఆర్ ( kcr ) కి నిర్వచనం తెలుసా అని ప్రశ్నించారు. మీ పక్కన ఉన్నాయన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే.. మీవద్ద ఉన్న ఎమ్మెల్యేలు సరిపోరని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా 2018 ఎన్నికల్లో మీరు ఆయనకు టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు.

read also : కాంగ్రెస్ లోకి భారీ చేరికలు .. హస్తం గూటికి నీలం మధు , మోత్కుపల్లి, నేతి, కపిలవాయి ..

ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ముతో భారత రాజకీయాలంటూ అధికారం, డబ్బు మదంతో విర్రవీగుతున్నది మీరు కాదా అని పొంగులేటి ప్రశ్నించారు. అలాంటి వారికి ప్రజాస్వామ్యం అనే పదం పలికే హక్కు ఉందా అని ఎద్దేవా చేశారు. నాలుగు కాంట్రాక్ట్ లు చేసి వచ్చిన డబ్బుతో విర్రవీగుతున్నారన్నారు. 2014 తర్వాత నాకు కేసిఆర్ ఎక్కడ కాంట్రాక్ట్ లు ఇచ్చారో నిరూపించాలన్నారు. లేదా కేసిఆర్ తడి బట్టలతో ఏ గుడికి వెళ్దామో చెప్పాలి.. నేనూ వస్తాను భగవంతుడి సమక్షంలో నాకు కాంట్రాక్ట్ లు ఇచ్చినట్లు ప్రమాణం చెయ్యాలన్నారు.

read also : పొంగులేటికి కాంగ్రెస్ అధిష్టానం జన్మదిన కానుక..

మాది మొదటి నుండి వ్యాపారస్థుల కుటుంబమే అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తమకు వ్యాపారాలు వ్యవసాయం ఉందన్నారు. కష్టపడి వ్యాపారం చేసి ట్యాక్స్ లు కట్టి మిగిలిన సొమ్ము మాత్రమే మేము రాజకీయాల్లో ఖర్చు చేస్తున్నామని, మరి కేసిఆర్ ఎలా డబ్బు సంపాదించి రాజకీయాలు చేస్తున్నారో తెలియజేలన్నారు. ఆయన ఇండస్ట్రియలిస్టా, ఆయన నాన్న తాత ఇండస్ట్రియలిస్ట్ లా అని ప్రశ్నించారు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన ప్రజా ధనంతో రాజకీయాలు చేసే కేసిఆర్.. మీరు ఏ వ్యాపారం చేసి లక్షలకోట్లకు అధిపతులయ్యారో చెప్పాలన్నారు. ఈ మధ్య ఎక్కడో మీటింగ్ లో ప్రజలు ఓడగొడితే రెస్ట్ తీసుకుంటాం అన్నారు. ఇప్పడి వరకు మీరు చేసింది అదే కదా..ఈ ఎన్నికల్లో ప్రజలు పూర్తి రెస్ట్ ఇస్తారన్నారు. కందాళతో కాదు.. మీరు రండి పాలేరులో పోటీ చేయడానికి అని సవాల్ విసిరారు.

Leave A Reply

Your email address will not be published.