Read News in Telugu Language
adsdaksha

అన్నకు తగ్గ తమ్ముడు.. ప్రచారంలో దూసుకుపోతున్న పొంగులేటి సోదరులు..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 24

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivasreddy ) పేరు తెలియని వారు ఉమ్మడి ఖమ్మం ( khammam ) జిల్లాలో అరుదనే చెప్పాలి. బిఆర్ఎస్ ( brs ) అసంతృప్త నేతగా ఆయన కాంగ్రెస్ ( congress ) పార్టీలో చేరాక, శ్రీనివాసరెడ్డి పేరు ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది. ఒక దశలో అధికార పార్టీకి చుక్కలు చూపించిన ఆయన, తనదైన రాజకీయ చతురతతో అంతులేని ఓపిక, సహనం ఆయుధాలుగా అధికార పార్టీకి సవాలుగా మారారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నాక లభించిన తెలంగాణ ప్రచార కమిటీ కో చైర్మన్ పదవితో బిజీగా మారిపోయారు. అంతమాత్రం చేత తన సొంత జిల్లాను .. తనను అభిమానించే ప్రజలను నిర్లక్ష్యం చేయకుండా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ మన్ననలందుకుంటుంన్నారు. ఇటీవల కాలంలో పార్టీ అధిష్టానం అప్పగించిన బాద్యతలతో క్షణం తీరికలేకుండా ఉన్నా, తాను పోటీచేయబోయే నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా తన తమ్ముడైన ప్రసాదరెడ్డికి ప్రచారం బాద్యతలు అప్పగించి వీలు కుదిరినప్పుడల్లా ప్రజలతో మమేకమవుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Hospital

read also : వైరా సీటు మనదే….! పొత్తుల్లో పోతుందనడంలో నిజం లేదు..

అన్నకు తగ్గ తమ్ముడు..

పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తన అన్న అప్పగించిన బాద్యతలను తూచ తప్పకుండా నిర్వర్తిస్తున్న ప్రసాదరెడ్డి ప్రచారంలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఒక దశలో ఈయనే ఎమ్మెల్యే అభ్యర్ధా అనే సందేహం జనంలో వ్యక్తమవుతోంది. ఎప్పుడు ఏ గ్రామం వెళతారో.. ఏ కాలనీలో ప్రచారానికి వస్తారో అర్ధం కాని పరిస్థితుల్లో ముందస్తు సమాచారం లేకుండా కేవలం స్థానిక నాయకులకు గంటల వ్యవధి సమాచారంతో ప్రచారానికి హాజరవుతున్నారు. మూస థోరణి ప్రచారానికి స్వస్తిచెప్పి వాస్తవాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ ముందుకుసాగుతున్నారు. మాటల్లో నెమ్మది, చెప్పే విషయంలో స్పష్టత.. అన్నశ్రీనివాసరెడ్డిని తలపించే వినయ విధేయతలు.. ప్రజలపట్ల చూపించే ఆప్యాయత, ఆత్మీయత ఆయనను ప్రజల్లోకి తీసికెళుతున్నాయి. దాంతో ప్రసాదరెడ్డి వస్తున్నాడని తెలియగానే స్థానిక ప్రజలు శ్రీనివాసరెడ్డి వస్తున్నంతగా సంబరపడుతూ బ్రహ్మరధం పడుతున్నారు. ప్రచారానికి స్వచ్ఛందంగా తరలివస్తూ అభిమానాన్ని చాటుకుంటుంన్నారు.

Leave A Reply

Your email address will not be published.