Read News in Telugu Language
adsdaksha

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పై సన్నాహక సమావేశం .. హాజరు కానున్నమంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 20

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పై మంగళవారం పాలేరు నియోజక వర్గ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ ( telangana ) రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( pongulrti srinivasreddy ), కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న( theenmar mallanna ) లు సమావేశానికి హాజరుకానున్నారు. ఖమ్మం ( khammam ) రూరల్ మండలం సత్యనారాయణపురంలోని టీసీవీ రెడ్డి ( tvc reddy ) ఫంక్షన్ హాల్లో జరగనున్న సమావేశంలో మంత్రి పొంగులేటి కార్యకర్తలకు నాయకులకు తీన్మార్ మల్లన్న విజయాన్నిఆకాంక్షిస్తూ దిశానిర్దేశం చెయ్యనున్నారు.

Hospital

read also : మాటలు కాదు.. చేతల్లో చూపిస్తా… మీ కష్ట సుఖాలను పంచుకుంటా..

ఈమేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నియోజక వర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు పట్టభద్రులు అధిక సంఖ్యలో హాజరై వారి మద్ధతును తీన్మార్ మల్లన్నకు తెలపాలని దయాకర్ రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.