Read News in Telugu Language
adsdaksha

భాగ్యనగరంలో 25 ఎలక్ట్రిక్ బస్సులు .. మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభం ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 12

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ( telangana ) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రి పొన్నం ప్రభాకర్ ( ponnam prabhakar ) ఆధ్వర్యంలో అభివృద్ధిబాటలో పయనిస్తోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ తెచ్చినప్పటికి ఆ మొత్తం అయ్యే టికెట్ల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ నేపథ్యంలో నెలకు కొంత బడ్జెట్ కేటాయిస్తుంది రేవంత్ సర్కార్. తాజాగా హైదరాబాద్ వాసుల కోసం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది.

read also : హర్యానా సీఎం ఖట్టర్ రాజీనామా .. కొత్త ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ..

ఆర్టీసీ ( ts rtc ) లోకి కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలక్ట్రిక్ బస్సును సొంతంగా నడిపారు. అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్న మొత్తం 500 బస్సులు ఆగస్టు (August) నాటికి రానున్నాయి. ఇందులో అన్ని నాన్ ఏసీ బస్సులే ఉన్నాయి.

Hospital

read also : ఆధార్ అప్డేట్‌కు గడువు పెంపు .. మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు వెల్లడి ..

పాత మెట్రో ఎక్స్ ప్రెస్ స్థానంలో వస్తున్నబస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులే అని గ్రేటర్ అధికారులు చెప్పారు. ఈ బస్సుల్లోనూ మహిళలు ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలకు ఇవీ నడుస్తాయి. బస్సులకు ఛార్జింగ్ కోసం బీహెచ్ఐఎల్, మియాపూర్, కంటోన్మెంట్, హెచ్.సియూ, రాణిగంజ్ డిపోల్లో 33 కేవీ పవర్ లైన్లు తీసుకున్నారు.

read also : ముగిసిన మంత్రి వర్గ భేటీ.. 4లక్షల 50వేల ఇండ్ల కు 22,500 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం..

మరోవైపు ఆర్టీసీ సొంతంగానే 565 డీజిల్ బస్సులు సమకూర్చుకుంటోంది. ఇందులో 125 మెట్రో డీలక్స్ బస్సులుంటాయి. ఇవన్నీ జూన్ నెల వరకు అందుబాటులోకి రానున్నాయి. మరో 440 బస్సుల్లో 300 మెట్రో ఎక్స్ ప్రెస్ కాగా 140 ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. ఈ బస్సులన్నిటిలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.