Read News in Telugu Language
adsdaksha

పూనం ఇక లేరు.. సినీనటి పూనం పాండే కన్నుమూత..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 2

బాలీవుడ్ నటీ, మోడల్ పూనం పాండే (32) ఇకలేరు. గత కొంతకాలంగా గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె గురువారం రాత్రి కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్ లోని తన నివాసంలో పూనం పాండే ( poonam pandey ) తుది శ్వాస విడిచారు.

Hospital

కాంట్రవర్సికి కేరాఫ్ అడ్రస్ అయిన ఆమె సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండేది. వివాదాస్పద ప్రకటనలతో తరచూ వార్తల్లో నిలిచే పాండే తన స్టైల్, సెక్సీ లుక్స్ తో యూత్ ను కట్టిపడేసేది. ఈ రకంగానే ఆమె ఫాలోవర్స్ చాలా మందిని పెంచుకున్నది. ట్విట్టర్, ఇన్ స్టాలో పోస్ట్ లు పెట్టడంతోనే ఆమెకు కొద్ది రోజుల్లోనే ఫుల్ పాపులారిటీ వచ్చింది. 2011 వరల్డ్ కప్ ఫైనల్ సమయంలో పాండే చేసిన ఓ ఛాలెంజ్ తీవ్ర వివాదాస్పదం అయింది. అప్పట్లో ఆ వీడియో అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. భారత జట్టు ఫైనల్ మ్యాచ్లో గెలిస్తే తాను బట్టలు విప్పుతానని ఆమె చేసిన ప్రకటన యావత్ భారత్ దాని గురించే చర్చించేలా చేసింది. ఆమెధైర్యాన్ని, సాహసోపేతమైన నిర్ణయంపై చాలా మంది ప్రశంసలు కురిపించారు.

Read also: సోరెన్ కు చుక్కెదురు.. జార్ఖండ్ మాజీ సీఎం బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం..

పూనమ్ పాండే చనిపోయినట్లు ఆమె వైద్య బృందం ప్రకటించింది. ‘ఈ ఉదయం మాకు కష్టతరమైనది. మా ప్రియమైన పూనమ్ ను గర్భాశయ క్యాన్సర్ తో కోల్పోయామని మీకు తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాం’ అని ట్వీట్ లో పేర్కొంది. పూనం పాండే మృతితో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.