Read News in Telugu Language
adsdaksha

salaar : చిన్న మెసేజ్ తో సలార్ లో ప్రభాస్ నడిపిన బైక్ ని ఇలా గెలుచుకోవచ్చు..

దక్ష న్యూస్, ఇంటర్ నెట్ డెస్క్ : ఏప్రిల్ 19

సలార్ సినిమాలో ప్రభాస్ నడిపిన బైక్ చూసే ఉంటారు. చిన్న మెసేజ్ తో ఇప్పుడు ఆ బైక్ ని గెలుచుకునే అవకాశం వచ్చింది. అయితే ఓ ఛానల్ కాంటెస్ట్‌లో పాల్గొని బైక్ ని గెలిచేసుకోవాలి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ( prabas ) నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ ( salaar ). గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ప్రభాస్ స్టామినాని మళ్ళీ మరోసారి అందరికి గుర్తు చేసింది. ఇక ఆ తరువాత ఓటీటీకి వచ్చిన ఈ చిత్రం.. అక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ ని అందుకుంది.

read also : ఎయిరిండియా బంప‌ర్ ఆఫ‌ర్‌..తొలిసారి ఓటేసే వారికి విమాన టికెట్ల‌పై 19 శాతం రాయితీ..

Hospital

ఇప్పుడు టెలివిజన్ లో సలార్ సందడి చేయడానికి సిద్దం అవుతోంది.
ఈ ఆదివారం (ఏప్రిల్ 21) సాయంత్రం 5.30 గం.లకు స్టార్ మా ఛానల్ ఈ సినిమా ప్రసారం చేయబోతోంది. ఇక ఈ సినిమా ప్రసారాన్ని మరింత ప్రత్యేకం చేయడం కోసం స్టార్ మా ఛానల్ ఓ ఎస్ఎంఎస్ కాంటెస్ట్ ని నిర్వహిస్తుంది. ఈ కాంటెస్ట్ లో గెలుస్తే.. ‘సలార్’లో ప్రభాస్ నడిపిన బైక్ గెలుచుకోవచ్చు. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే.. స్టార్ మాలో సలార్ సినిమా ప్రసారం అవుతున్న టైములో స్క్రీన్ పై ఎడమవైపు బైక్ ఇమేజ్ ఎన్నిసార్లు కనిపించిందో గమనించి +91 9222211199 నెంబర్ కి మెసేజ్ చేయాలి.

read also : Dehydration : ప్రమాదకరంగా పిల్లలలో డీహైడ్రేషన్.. జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు..

అయితే ఈ మెసేజ్ ని ఎలా చేయాలంటే.. SALAAR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, ఆ తరువాత బైక్ ఎన్నిసార్లు కనిపించిందో ఆ సంఖ్యని టైప్ చేసి పైన తెలిపిన నెంబర్ కి మెసేజ్ చేయాలి. మరి ఈ సువర్ణావకాశాన్ని మిస్ చేసుకోకండి. ప్రభాస్ నడిపిన ఆ బండిని చిన్న ఎస్ఎంఎస్ ద్వారా సొంతం చేసేసుకోండి.

 

Leave A Reply

Your email address will not be published.