Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్ అంటే మైగ్రేషన్.. బీఅర్ఎస్ అంటే ఇరిగేషన్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : సెప్టెంబర్ 29

బీఅర్ఎస్ పార్టీవి స్కీములు.. కాంగ్రెస్ వి స్కాములు..

కాంగ్రెస్ ను నమ్మితే కన్నీళ్లు.. బీఅర్ఎస్ తో సాగునీళ్లు..

ఆ పార్టీవి వారంటీ లేని గ్యారంటీలు..

– వనపర్తి పదేళ్ళ ప్రగతి మహాసభలో మంత్రి కేటిఆర్..

కాంగ్రెస్ ( congress )అంటే మైగ్రేషన్.. బీఅర్ఎస్ ( brs ) అంటే ఇరిగేషన్ అని మంత్రి కేటిఆర్ ( ktr ) అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉన్నదని, ఆపార్టీని నమ్ముకుంటే 24 గంటల కరంటు పోయి .. 3 గంటల కరంటు ఖాయమన్నారు. శుక్రవారం వనపర్తి ( vanaparthi ) పదేళ్ళ ప్రగతి మహాసభ ( pragathi mahasabha ) లో మంత్రి కేటిఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ని నమ్ముకుంటే నల్లా నీళ్లు బందయి నీళ్ల కోసం ఎదురుచూస్తే పరిస్థితి వస్తుందన్నారు.

పాలమూరుకు వస్తున్న మోడీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా ఇవ్వాలని కేటిఆర్ డిమాండ్ చేశారు. కృష్ణా నీటిలో తెలంగాణ వాటా 575 టీఎంసీల కేటాయించాలన్నారు. తెలంగాణ అంటే మోడీకి ఎందుకు కక్ష్య
వాల్మీకీ బోయలకు ఎస్టీ హోదా కోసం రెండుసార్లు తీర్మానం పంపినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ కు అధికారం ఇవ్వాలని, కేంద్రంలో మన ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పడొద్దన్నారు. గులాబీ జెండా ఎగిరేసే వరకు పాలమూరును పట్టించు కోలేదని, జిల్లాను దత్తత తీసుకున్నోళ్లు కూడా దగా చేశారన్నారు.

read also : అక్టోబర్ 3న ఎలక్షన్ కమిషన్ పర్యటన..

Hospital

జిల్లా నుండి 14 లక్షల మంది వలస పోతుంటే ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదని మంత్రి కేటిఆర్ విమర్శించారు. నది పక్కన నేలలున్నా ఏ ప్రభుత్వం కూడా నీళ్లివ్వలేదన్నారు. ఆర్డీఎస్ తూములు పగులగొట్టి నీళ్లు తీసుకుపోతున్నా పట్టించుకోలేదు అక్రమంగా నీళ్లు తీసుకుపోతుంటే హారతులిచ్చి పంపించింది దగుల్బాజీ కాంగ్రెస్ నేతలు నాడు మనిషి చనిపోతే స్నానాలు చేయడానికి నీళ్లు లేని పరిస్థితి నుండి రైతులను ఆదుకుని రైతుబంధుతో అండగా నిలిచింది కేసీఆరే ప్రభుత్వంఅన్నారు. ఇంటింటికి నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్ దే అని
ఆడపిల్లల పెళ్లికి రూ.లక్ష 116 ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు.రైతుభీమా పథకం కింద వనపర్తి జిల్లాలో 1400 మంది రైతులకు రూ.5 లక్షల సాయం అందించారు. 11 సార్లు అధికారం అనుభవించిన కాంగ్రెస్ పార్టీ సమస్యల గురించి మాట్లాడడం హంతకులు సానుభూతి చెప్పినట్లుందని ఎద్దేవా చేశారు. వస్తదో రాదో తెలియని తెలంగాణ కోసం కొట్లాడిన చరిత్ర మాది. పదవుల కోసం కాదు ప్రాంతం సమస్యలు తీరాలని కొట్లాడారు. మంత్రి పదవి ఆశించి వారు ఉద్యమం చేయలేదు వనపర్తికి లక్ష 25 వేల ఎకరాలకు నీళ్లొచ్చాయంటే అది నిరంజన్ రెడ్డి ఘనత, కేసీఆర్ ఆశీస్సుల వల్లే సాధ్యం అయిందన్నారు.

read also : రేపే జిల్లాలో కేటిఆర్ పర్యటన..

డిగ్రీ కళాశాల కోసం ధర్నాలు చేసిన స్థితి నుండి వనపర్తికి మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చాయని గర్వంగా గల్లా ఎగరేసి చెప్పొచ్చన్నారు. 180 కోట్లతో నూతన ఆసుపత్రిని నిర్మించాం. వనపర్తిని జిల్లా చేసి కలెక్టరేట్ నిర్మించాం. పీర్ల గుట్ట డబుల్ బెడ్రూం ఇండ్లు బంజారాహిల్స్ లా ఉన్నాయి. 3280 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించుకున్నాం. ఐటీఐ, కేజీబీవీ, వ్యవసాయ డిగ్రీ కళాశాలల నిర్మాణం జరిగాయి. ఇంటి పెద్దలా నిరంజన్ రెడ్డి వనపర్తిని అభివృద్ది చేస్తున్నారు. 65 ఏళ్లలో చేయని పనిని ఐదేళ్లలో చేసి చూయించారన్నారు.

కేసీఆర్ కుడిభుజంగా తెలంగాణ జెండా ఎత్తి గ్రామగ్రామాన తెలంగాణ ఉద్యమాన్ని రగిలించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు అభివృద్దికి నిరంతరం కృషిచేస్తున్నారు. సిరిసిల్ల, సిద్దిపేట మాదిరిగా అత్యధిక మెజారిటీతో నిరంజన్ రెడ్డి ని మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు.

read also : గృహలక్ష్మి సీఎం కేసిఆర్ మానస పుత్రిక : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, రూ.22 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణం, సిరిసిల్ల, సిద్దిపేటతో పోటీపడి వనపర్తిని అభివృద్ది చేశానన్నారు. మీరిచ్చిన విజయానికి కృతజ్ఞతగా నియోజకవర్గాన్ని అభివృద్ది చేశానని వనపర్తి బహిరంగసభను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వనపర్తిలో అనూహ్యమైన అభివృద్ది జరిగిందన్నారు.ఐటీ టవర్ నిర్మాణానికి జీఓ విడుదల చేసిన కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. 75 వేల ఎకరాలకు నీళ్లిచ్చిన తర్వాతనే నామినేషన్ వేస్తానని మాటిచ్చి నిలబెట్టుకుని నామినేషన్ వేశాను. ఇప్పుడు లక్ష 25 వేల ఎకరాలకు సాగునీళ్లు తీసుకువచ్చాను ప్రభుత్వ సహకారంతో అనేక విద్యాసంస్థలు తీసుకువచ్చాను మీ ఆశీస్సులతో మరింత అభివృద్ది చేస్తానన్నారు.

వనపర్తి పదేళ్ల ప్రగతి మహాసభలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, వీఎం అబ్రహం , ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్ రెడ్డి , కార్పోరేషన్ చైర్మన్లు , జడ్పీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.