Read News in Telugu Language
adsdaksha

ఖమ్మం నాఇల్లు.. ఇక్కడి ప్రజలు నాకుటుంబ సభ్యులు..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 10

చేయాల్సిన ఆవిష్కరణలెన్నో ఉన్నాయి..

వాటన్నిటిని సాధిస్తాం..

అది నా బాధ్యత .. మంత్రి పువ్వాడ

ఖమ్మం ( khammam ) అనేక మున్సిపాలిటీ లకు ఆదర్శంగా నిలిచిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) అన్నారు. ఆదివారం రఘునాథపాలెం రోడ్ లో గల ప్రగతి ప్రైడ్ ( pragathi pried ) నందు చావా రాము ( chava ramu ) అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఖమ్మం నగరంలోని ప్రతి గల్లీలో ప్రజలకు కావాల్సిన అన్ని మౌళిక వసతులు, సౌకర్యాలు కల్పించిన ఘనత బిఆర్ఎస్ ( brs ) ప్రభుత్వదే అన్నారు. మన ఖమ్మంలో జరిగిన అభివృద్దిని చూసి ఇతర మున్సిపాలిటీ లు అనుకరిస్తున్నాయన్నారు.

read also : ట్యాంక్ బండపై చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి ..

ఖమ్మం లో జరిగిన పనులను అసెంబ్లీ లో మంత్రి కేటిఆర్ పోటోలను చూపిస్తూ మెచ్చుకుంటున్నారని మంత్రి తెలిపారు. ఖమ్మం నగరం ఏ పరిస్థితి నుండి నేడు ఏ స్థాయికి చేరుకుందనేది మన కళ్ళ ముందే ఉందన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినన్ని నిధులు ఖమ్మం జిల్లా చరిత్రలో ఎప్పుడూ రాలేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటిఆర్ సహకారం వల్లే ఇది సాధ్యమైందన్నారు.

Hospital

ఇదే అభివృద్ది కొనసాగాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ను మళ్ళీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. హ్యాట్రిక్ కొట్టాలి.. అభివృద్ధిని కొనసాగించాలని మంత్రి పువ్వాడ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఖమ్మం నగర ప్రజల సమస్యలు నా సమస్యలుగా భావించా కాబట్టే నేడు గొంగళి పురుగులా ఉన్న ఖమ్మం ను సీతాకొకచిలుకలా మార్చామన్నారు.

read also : ప్రవాసుల సంఘర్షణలకు, అస్త్తిత్వవేదనకు అద్దం పట్టిన నిశాంత్‌ ఇంజమ్‌..

ప్రజలకు కావాల్సిన ప్రధమ వసతి త్రాగునీరు.. అది నేడు ప్రతి ఇంటికి అందించా అన్నారు. ఒక్క ఇంటిని కూడా వదలకుండా ప్రతి ఇంటికి త్రాగునీరు నల్లలు ఎర్పాటు చేసి అందిస్తున్నాం. నగరం నలు దిక్కుల అభివృద్ది జరిగింది. అది కేవలం ఖమ్మంకు మంత్రి పదవి రావడం వల్లే సాధ్యమైందన్నారు. గడిచిన 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా ఖమ్మం కు మంత్రి పదవి ఇవ్వాలేదని పువ్వాడ గుర్తు చేశారు. అది కేసీఆర్ వల్లే సాధ్యమయిందని అన్నారు.

ఖమ్మంను ఇంకా ఉన్నత స్థాయిలో చూడాలని ఉందని, ఇప్పటికే ఆశించిన దాని కంటే ఎక్కువే అభివృద్ది చేసుకున్నాం అన్నారు. కానీ నా ఆలోచనలో చేయాల్సినవి మరెన్నో ఆవిష్కరణలు ఉన్నాయని, వాటన్నిటిని సాధిస్తాం.. అది నా బాధ్యత అన్నారు. ఖమ్మం నగరం నా ఇల్లు.. ప్రజలు నా కుటుంబం అని పేర్కొన్నారు.

read also : నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడరాదు.. దక్షిణ దిశ దీపంతో అరిష్టాలు..

కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మండేపుడి జగదీష్, మద్దినేని వెంకటరమణ, గరికపాటి వేంకటేశ్వర రావు ( gvr ), కాటా సత్యనారాయణ బాబ్జీ, వల్లభనేని రమారావు, నెల్లూరి చంద్రయ్య, కన్నేకంటి శివరామ కృష్ణ, నాగేశ్వర రావు, చుంచు గోపి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.