Read News in Telugu Language
adsdaksha

ప్రగతి భవన్ లో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు..

దక్షన్యూస్, హైదరాబాద్: ఆగస్ట్ 31

సీఎం కేసిఆర్ కి రాఖీలు కట్టి ఆశీర్వదించిన తోబుట్టువులు..

రాఖీ పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ ( hyderabad ) ప్రగతి భవన్ ( pragathibhavan ) లో వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ( telangana ) ముఖ్యమంత్రి కేసిఆర్ ( cm kcr ) కి ప్రగతి భవన్లో గురువారం ఆయన అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. తమ సోదరుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం వర్థిల్లాలని ఆశీర్వదించారు. కేసిఆర్ అక్కలకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు.

Hospital

రక్షాబంధన్ సందర్భంగా  సీఎం కేసిఆర్ తోబుట్టువుల రాకతో ప్రగతి భవన్ సందడిని సంతరించుకుంది. ప్రేమానురాగాలు అనుబంధాలకు ప్రతీక అయిన రక్షాబంధన్ వేడుకతో ప్రగతి భవన్ కళకళలాడింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ, తదితరులు పాల్గొన్నారు.

read also : cm kcr : ఆడపడుచులకు సీఎం కేసిఆర్ రక్షా బంధన్ శుభకాంక్షలు..

Leave A Reply

Your email address will not be published.