Read News in Telugu Language
adsdaksha

బిజెపి నేత త్వరలో బిఆర్ఎస్ లోకి .. కేటీఆర్ హరీష్ రావు లతో భేటీ

దక్ష న్యూస్, రామగుండం : ఆగస్ట్ 18

రామగుండం ( ramagumdam) నియోజకవర్గానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు కౌశిక్ హరి ( kaushik Hari ) త్వరలోనే బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్ ( pragathibhavan) లో మంత్రులు కేటీ రామారావు హరీష్ రావు లతో భేటీ అయ్యారు. పార్టీ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రామగుండం స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ భేటీలో పాల్గొన్నారు.

Hospital

Read also : 26 న రాష్ట్ర వ్యాప్తంగా నాటనున్న కోటి మొక్కలు.. సీఎస్ శాంతి కుమారి..

త్వరలోనే రామగుండంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కౌశిక్ హరి తో సహా పలువురు బిజెపి ( bjp ) సీనియర్ నాయకులు బిఆర్ఎస్ లోకి చేరనున్నారు. సంఘటిత అసంఘటిత కార్మిక సంఘాల నాయకులుగా రామగుండం ప్రాంతంలో ప్రజాదరణ పొందిన నేతగా కౌశిక్ హరికి ప్రజల్లో మంచి పట్టు ఉంది. 2009లో పిఆర్పి నుంచి పోటీ చేయగా కేవలం 1200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రజల్లో పట్టు ఉన్న నేత కావడంతో కౌశిక్ హరి చేరిక ప్రాధాన్యత సంతరించుకున్నది.

Leave A Reply

Your email address will not be published.