Read News in Telugu Language
adsdaksha

రైతుల బాధలు నాకు తెలుసు నేనూ కాపోన్నే… ఎన్నికల్లో ప్రజలే గెలవాలె..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 1

మాకు బాస్ లు ఢిల్లీలో లేరు మీరే మా బాస్ లు..

ఓటు వేసే ముందు చర్చ జరగాలె : ఇల్లందు సభలో కేసిఆర్..

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో సక్సెస్ అయిన ప్రజా ఆశీర్వాద సభ..

ఓటు వేసే ముందు అభ్యర్థిని చూడడం మాత్రమే కాదని అభ్యర్థి వెనుక ఉన్న పార్టీని కూడా చూడాలని అప్పుడే ఎన్నికల్లో ప్రజలు గెలుస్తారని సీఎం కేసిఆర్ ( cm kcr ) అన్నారు. బుధవారం ఇల్లెందు ( yellandu ) లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ ( praja aaservadasabha ) కు ముఖ్యమంత్రి కేసిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు గెలవాలంటే తప్పకుండా ఓటు వేసే ముందే ఓటు ఎవరికి వేయాలనే అంశంపై చర్చ జరగాలన్నారు. అప్పుడు మాత్రమే సరైన అభ్యర్థికి ఓటు వేస్తారన్నారు. ఎలక్షన్ రాంగనే ఆగమాగం కావద్దని ఓటే ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం అన్నారు. మీరు ఓటెయ్యకపోతే మేమేం చెయ్యలేం. కూరగాయలు కొనాలన్నాబాగున్నయో లేదో అని చూస్తాం. ఓ కూజా కొనాలన్నా దాన్ని కొట్టి చూస్తాం అది బాగుందో లేదో అని చూసి కొంటాం .. మరి ఓటు వేసే ముందు ఆలోచించాలన్నారు.

ఎన్నికలన్నపుడు ఎవరో వొకరు వస్తరు కానీ మీరు గుర్తించి వోటు వేయాలని, అప్పుడే ప్రజలు గెలుస్తరని కేసిఆర్ అన్నారు. మీలో వొకడుగా తెలంగాణ తెచ్చిన బిడ్డగా చెప్తున్న. మీరు వోటు వేసేముందు మీ వూరికి పోయి చర్చించుకోవాలె. అభ్యర్థి వెనకున్న పార్టీ ఏంది ఆ పార్టీ వైఖరేంది ఆ పార్టీ ప్రజలకు ఏమి చేస్తుంది అనేది ఆలోచించాలన్నారు. అంతకు ముందు టిడిపి కాంగ్రేస్ పార్టీలు దశాబ్ధాల పాటు పాలన చేశారు. వారందరి చరిత్ర మీ కండ్లముందున్నది. వోటు అలవోకగా తమాషా కోసం వేయొద్దు. మీ చేతిలో వున్న వజ్రాయుధం మీ తలరాతను మార్చేది వోటే. మీశక్తి మీ వోటు. జాగ్రత్త పరిణితితో వోటు వేయాలని కోరారు.

Hospital

read also : ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు..

బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎన్ని పనులు చేశామో చూడాలని కేసిఆర్ అన్నారు.
ఎన్నికల మానిఫెస్టోలో పెట్టనివీ కూడా చేసినం. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ చెప్పకుంటనే చేసినం. కొత్త కుండలో ఈగజొచ్చినట్టు కొత్త సంసారం నడిపించినట్టు.. మారుమూల పల్లెల్లో గిరిజన తాండాల్లో కరెంటు తెచ్చినం. యావత్ భారత దేశంలో 24 గంటలు కరెంటిచ్చే వొకే వొక రాష్ట్రం తెలంగాణ.
ప్రధాని కి ప్రైవేటు పిచ్చిపట్టింది. అన్నీ చేసిండు ఆఖరికి కరెంటు కూడ ప్రయివేటు చేస్తనని నన్ను బెదిరించాడు. నీళ్ళ మోటర్లకు మీటర్లు పెట్టమంటే పెట్టనని తలకాయ తెగిపడ్డా పెట్టనని చెప్పిన అని పేర్కొన్నారు.

రైతుల బాధలు నాకు తెలుసు నేనూ కాపోన్నేఅని సీఎం కేసిఆర్ అన్నారు.
తెలంగాణ వచ్చిన్నాడు ఎట్ల సక్కదిద్దాలె అని మెదడు కరగదీసి, చర్చించి, కార్యాచరణ చేసినం. వ్యవసాయ స్థిరీకరణ చేయాలనే నిర్ణయం లో భాగమే రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు. అప్పులుంటే మన తలుపు కూడ పీక్కోని పోయిండ్రు.
ఆపద్భందు పేరుతో పైరవీ కారులు మేసేది. ఇయ్యాల వ్యవసాయం నిలబడ్డది. రైతులు తేటపడ్డరు. పిల్లను ఇయ్యాలంటే రైతుకు ఇవ్వకపోదురు. ఇప్పుడు భూమివుంటెనే ఇస్తున్నరు. ఇఫ్పుడు నీటి తీరువా రద్దు చేసుకున్నం. ధరణి పోర్టల్ తెచ్చుకున్నం. గోల్ మాల్ చేసే పరిస్థితి లేదు. రైతులకు పెద్ద సంఖ్యలో పోడు భూములిచ్చిన అన్నారు.

ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ హయాంలో 17,891 మంది పోడు రైతులకు 55,460 ఎకరాల భూములను పంచినం. పోడు కేసులు రద్దు చేసి, వాళ్ళకూ రైతుబంధు ఇచ్చినం. గిరిజన రైతుల వ్యవసాయానికి త్రీ ఫేజ్ కరెంటు ఇస్తున్నం.
ఇల్లందు గ్రామాల్లో వాన పడితే చెప్పులు చేతుల పట్టుకోని నడిచిపోయేటోల్లం. హరిప్రియ నాతోని కొట్లాడి రోడ్లు వేయించింది. ఇల్లందు పట్టణంలో అందమొచ్చింది. వొక దరికొచ్చింది. ఎవరు యేం చేసినారు అనేది ఆలోచన చేయాలె. కొమరారం ఇంకోటి రెండు మండలాలు చేయాలి. హరిప్రియ నాయక్ నా బిడ్డలాంటిది. వాటిని ఎన్నికల తర్వాత ఏర్పాటు చేస్తాం. అన్నారు.

read also : కాలం చెల్లిన వారంటీలతో వస్తున్నకాంగ్రెస్ కి సత్తుపల్లిలో అభ్యర్ధులెవరు..

వొకనాడు అన్నమో రామచంద్ర అని గొడగొడ ఏడ్సిన తెలంగాణ నేడు 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తున్నదని కేసిఆర్ అన్నారు. 93 లక్షల మంది కార్డు హోల్డర్లకు సన్నబియ్యం ఇస్తం. పెన్షన్లను 5 వేలకు పెంచుకుందాం. మహిలలకు 3 వేలిస్తం. గ్యాస్ సిలండర్ ధర రూ. 400 లకు అందిస్తం. రైతుబీమా అనేక మందిని కాపాడుతున్నది.
ఏ పార్టీ వైఖరేందని ఆలోచించాలె. విధి వంచితులైనవాల్లను ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం మీద వున్నదనే మానవీయ కోణంలో పెన్షన్లు అందించడం జరగుతున్నది. ఆర్థిక పరిస్థితిని పట్టి పెంచుకుంటూ పోతం. వైద్యం మంచిగా అందుతున్నది. కేసీఆర్ కిట్ వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నం. విద్యారంగంలో కూడా తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తున్నది. ఇవన్నీ కూడా మీ కండ్లముందే జరుగుతున్నవి. మీ ఆశీస్సులుంటే సీతారామ ప్రాజెక్టు కూడా త్వరలో పూర్తయితది. ఇంకా రాని మండలాలకు కూడా లిఫ్టు పెట్టి నీల్లు తెప్పిస్తం అన్నారు.

గిరిజన తాండాలను గ్రామ పంచాయితీలుగ చేయాలని దశాబ్దాలుగా పోరాడినా ఎవరూ పట్టించుకోలే. కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అద్భుత ఫలితాలను సాధిస్తున్నది. వైకుంఠ ధామాలను నిర్మించుకున్నం. మాకు బాస్ లు ఢిల్లీలో లేరు మీరే మా బాస్ లు. మీకు బిఆర్ఎస్ శ్రీరామ రక్ష గా వుంటది. విద్యావంతురాలైన హరిప్రియ నాయక్ కారు గుర్తుకు వోటేసి గెలిపించాలె. ఈ సభను చూస్తే విజయం ఖాయం అని తెలిసిపోయింది.
ఇక సెలవు అంటూ కేసిఆర్ తన ప్రసంగం ముగించారు.

Leave A Reply

Your email address will not be published.