Read News in Telugu Language
adsdaksha

దీని భావమేమి చంద్ర శేఖరా.. మండుటెండల్లో ప్రజా ఆశీర్వాద సభలు..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 2

టెంట్ లు వద్దట.. ఇదేం చోద్యమో.. అల్లాడుతున్నఅభిమానులు కార్యకర్తలు..

ఫోటో షూట్ లకు అడ్డమనా.. లేక ఏదైనా సెంటీ మెంటా..

ప్రజల ఇక్కట్ల మధ్య ప్రజా ఆశీర్వాద సభలు..

ఫుడ్డు సంగతి పక్కన పెడితే నీడ కరువు.. నీటి ప్యాకెట్లతో చల్లబరుస్తున్న నాయకులు..

ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభ పట్ల సర్వత్రా ఆసక్తి..

గతంలో ఎక్కడ ప్రజాప్రతినిధుల సభలు జరిగినా భారీ కేడ్లతోపాటూ భారీ టెంట్ లు వేయడం చూశాం. వేలాది.. సభను బట్టి లక్షలాది కుర్చిలు వేసి వచ్చిన వారు కూర్చొని సభను వీక్షించడం, నాయకులు  చెప్పే మాటలు శ్రద్దగా వినడం.. ఏ ఆహార ప్యాకెట్లో, మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లు ఇస్తే దాహం తీర్చుకోవడం సహజంగా సభల్లో కనిపించే దృశ్యాలు. తెలంగాణ ( telangana ) ఏర్పడ్డ కొత్తలో సీఎం కేసిఆర్ ( cm kcr ) సభ అంటే భోజనం ఏర్పాట్లు, వచ్చిన వారికి ఎక్కడా ఎండ తగలకుండా షామియానాలు, ఎక్కడికక్కడ కూలర్లు, నీటి తుంపరలు కురిపించే శీతలీకరణ ఏర్పాట్లు వింత అనుభూతిని కలిగించేవి. ఆహ్లాదకర వాతావరణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రసంగిస్తుంటే జనం కదలకుండా కూర్చొని వినడం చూశాం. కానీ ఇదేం విడ్డూరమో.. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభ ( praja aaservadasabha ) ల్లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. షామియానాలు కాదు గదా.. సామన్య టెంట్లు కూడా వేయడం లేదు. ఆహార పొట్లాల మాట దేవుడెరుగు తాగడానికి అరకొర నీటి ప్యాకెట్లతో సరిపెడుతూ ప్రజలను అరిగోస పెడుతున్నారు. అప్పటి వరకు కేసిఆర్ ను చూడాలని ఆయన ఏం చెపుతాడో వినాలని ఆసక్తిగా వచ్చిన ప్రజలు సభా ప్రాంగణం వద్ద నిలువ నీడ కనిపించక పోవడంతో, ఇదేం మీటింగ్.. ఇంత నీడ కూడా వెయ్యరా.. అని బహిరంగంగానే విమర్శించడం కనిపిస్తోంది.

Hospital

read also : జిల్లాకు మంత్రి పదవి ఇచ్చిన ఘనత కేసీఆర్ దే..

ఇటీవల ఖమ్మం జిల్లా పాలేరు నియోజకర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జీళ్లచెరువులో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. సభా ఏర్పాట్లలో భాగంగా సభకు ఒకరోజు ముందే అక్కడి అభ్యర్థి కందాళ సభావేదికతోపాటూ, సభకు హాజరయ్యే జనం కోసం టెంట్ లు కూడా వేయించారు. కానీ అదేం చోద్యమో .. ఆవిషయం తెలుసుకున్నబిఆర్ఎస్ అధిష్టానం టెంట్లు తొలగించాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. దాంతో వేసిన టెంట్ లు కూడా తొలగించినట్లు తెలుస్తోంది. దాంతో సభకు హాజరయిన ప్రజలు ఎండకు తాళలేక పడరాని పాట్లు పడ్డారు. ప్యాకెట్ నీళ్ళతో గొంతు తడుపుకొని బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు.

సత్తుపల్లిది ఇదే తీరు. అదే రోజు ఇల్లందులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ.. రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో సక్సెస్ అయినా, సభకు బయల్దేరిన నియోజకవర్గ ప్రజలు మధ్యాహ్నం రెండు గంటలకు సభావేదిక వద్దకు చేరుకోవాలని బయల్దేరి ఎండ కారణంగా తమ వాహనాలు చెట్ల కింద ఆపుకొని సెదదీరడం కనిపించింది. కేసిఆర్ సత్తుపల్లిలో సభ ముగించుకొని హెలికాఫ్టర్ లో ఇల్లందు చేరుకునే సమయానికి జనం సభాప్రాంగణం వద్దకు చేరుకున్నారు. సాయంత్రం గం. 4లకు సభ మొదలైనా ఎండ పూర్తిగా తగ్గకపోవడంతో ఎదురెండలోనే సీఎం ప్రసంగం వినాల్సిన పరిస్థితి దాపురించింది. ఇక మీడియా ప్రతినిధుల కష్టాలు చెప్పతరం కాదు. సీఎం వస్తున్నారని ముందే కెమెరాలు సిద్దం చేసుకొని ఎర్రటి ఎండలోనే నిరీక్షించాల్సిన పరిస్థితి.

read also : రైతుల బాధలు నాకు తెలుసు నేనూ కాపోన్నే… ఎన్నికల్లో ప్రజలే గెలవాలె..

రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ప్రజా ఆశీర్వాద సభ జరిగినా, ఒకే మోడల్ లో సభావేదిక నిర్మించాలని ఆదేశించే ఆపార్టీ అధిష్టానం, సభా వేదిక నిర్మాణం.. అలంకరణ లకు ఇచ్చే ప్రాధాన్యం నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు తరలివచ్చే సభా ప్రాంగణానికి ఇవ్వకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో గెలుపుకు వందల కోట్లు వెచ్చించే నాయకులు, తమ నియోజకవర్గ ప్రజలు హాజరయ్యే సభకు కనీసం టెంట్ లు కూడా వేయించలేరా అని బిఆర్ఎస్ అధిష్టానం నిర్లక్ష్యానికి కారణం ఏంటి.. నిధుల లేమా.. లేక ఏదైనా సెంటీ మెంటా.. ఒక వైపు ఎండకు అల్లడుతూ మరో వైపు సీఎం ప్రసంగాన్ని ఏవిధంగా అర్ధం చేసుకోవాలని సభలకు హాజరైన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఈనెల 5న మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో ఖమ్మంలో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభకు ఇదే సీన్ రిపీట్ అవుతుందేమో అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. చూద్దాం జిల్లా మంత్రి ఇలాకాలో ఏర్పాట్లు ఏవిధంగా ఉండబోతున్నాయో..

Leave A Reply

Your email address will not be published.