Read News in Telugu Language
adsdaksha

తుమ్మ పొదలు కావాలా.. పువ్వాడ పూలు కావాలా నిర్ణయించుకోండి..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 5

ఇక్కడొక అర్భకుడు బిఆర్ఎస్ నాయకులను అసెంబ్లీ తాకనీయడట..

ప్రభుత్వానికున్న విజన్, అజయ్ మిషన్ తోడయితేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమయింది..

అజయ్ ఏడేళ్ళు కష్టపడితే ఖమ్మానికి ఈ రూపం వచ్చింది..

ఇక్కడ కరటకధమనుల పీడా వదిలించినం..

– ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసిఆర్..

76 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో మనకు రావాల్సిన ప్రజాస్వామ్య పరిణితి రాలేదని సీఎం కేసిఆర్ ( cm kcr ) అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే మనిషి గుణం గణం చూడాలన్నారు. సేవ చేస్తడా.. గెలిచాక ముఖం చాటేస్తడా చూడాలన్నారు. ఆదివారం ఖమ్మం ( khammam ) లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ ( praja aseervada sabha ) లో సీఎం కేసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గెలిచే అభ్యర్థి ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. విచక్షణతో ఓటు వేయాలని, ప్రజల చేతిలో ఉండే ఒకే ఒక ఆయుధం ఓటన్నారు. దాన్ని మంచి భవిష్యత్తుకోసం వాడాలని పిలుపునిచ్చారు. ఇదే జిల్లాకు చెందిన కవి 70 ఏళ్ళ క్రితం రావెళ్ళ వెంకటరామారావు ఓటుపై పాట రాశారని గుర్తు చేశారు.

Hospital

ఖమ్మాన్ని చూసి గర్వపడుతున్నాని సీఎం కేసిఆర్ వ్యాఖ్యానించారు. గోళ్ళపాడు మురికి కంపును ఎన్నిఏళ్ళు భరించినం.. లకారం చెరువును ఎంత సుందరంగా తయారుచేసినం. రూ.100 కోట్లతో బాగుచేసినం అన్నారు. వైకుంఠ ధామాలు, మార్కెట్ లు ఎంత బాగున్నాయి. ఖమ్మం అంటే ఇరుకు సందులు .. మురికి రోడ్లు ట్రాఫిక్ కష్టాలు ఉండేవి. ఇప్పడు మీ కళ్ళముందు ఎలా కనపడుతుందో ఆలోచించాలన్నారు. అవన్నీ మాయ చేస్తే రాలే. రాత్రికి రాత్రి రాలే..మీ అభ్యర్థి పువ్వాడ కష్టపడితే వచ్చాయన్నారు. పేపర్లో వార్తలోచ్చేవి వాడవాడలో పువ్వాడ అని. ఆయన సైకిల్ వేసుకొని తిరిగేది. 7 సంవత్సరాలు నిరంతరం కష్టపడితే ఖమ్మానికి ఈ రూపం వచ్చిందన్నారు.

read also : దళితులను అమ్మపేరు చెప్పి, బొమ్మ పేరు చెప్పి ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు..

ఒకనాటి లకారానికి నేటి లకారానికి పోలికే లేదని కేసిఆర్ అన్నారు. రూ. 700 కోట్లు పట్టుబట్టి అజయ్ నావద్ద మంజూరు చేయించుకున్నరు. దయచేసి మంచి నాయకుడ్ని గెలిపించుకోవాలన్నారు. పువ్వాడ అజయ్ ని గెలిపిస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటడు. తుమ్మ ముళ్ళ తుమ్మల కావాలో పువ్వాడ పూలు కావాలో ఆలోచించుకోవాలన్నారు. తుమ్మ తుప్పలు తెచ్చుకుంటే మీరు ఇబ్బంది పడతరన్నారు. ఇక్కడ అజయ్ మెడికల్ కాలేజీ, ఆర్టీసి బస్టాండ్ కట్టిచ్చిండు. అన్ని పట్టణాల్లో ఇలాంటి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నం. ట్యాప్ లు తిప్పితే నీళ్ళు వస్తున్నయి. ఇన్వర్టర్, కన్వర్టర్ జనరేటర్ గతంలో అన్ని ఇళ్ళల్లో ఉండేవి. ఇక్కడ మంచి ఎమ్మెల్యే మంచి ఎంపీ ఉన్నారు. రఘునాధపాలెంలో ఒక్క రోడ్డు కూడా మట్టిరోడ్డులేదు. ప్రభుత్వానికున్న విజన్, అజయ్ మిషన్ తోడయితేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమయిందన్నారు.

ఒకాయన చాలా గొప్పవాడు.. పొయినసారి నేను ఒకాయనకు మంత్రి పదవి ఇస్తే ఆయన నాకే మంత్రి పదవి ఇచ్చిన్నని చెప్పుకున్నడు అంటూ ఎద్దేవా చేశారు. ఖమ్మానికి కరటకధమనుల పీడ వదిలించిన. పరవస్తు చిన్నయసూరి కథ చదవండి వారి గురించి తెలుస్తుంది. ఖమ్మానికి వారి పీడ వదిలిచ్చినం. ప్రజాస్వామ్యంలో మాటలకు పరిమితి ఉంటది. ఒక అర్బకుడు బిఆర్ఎస్ నాయకుల్ని అసెంబ్లీ తాకనీయ అని మాట్లాడుతావున్నడు. నువ్వు గుత్త పట్టినవా..ఖమ్మం జిల్లాను కొనేసినవా.. ప్రజలు నిన్ను క్షమిస్తరా..విచక్షణతో ఆలోచించండి. బిజేపి కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా తెలంగాణ జెండా పట్టిండ్రా.. రాబోయే కాలమంతా ప్రాంతీయ పార్టీల యుగమే. ఇవన్నీ ఆలోచించే అజయ్ ని గెలిపించాలని కోరుతున్నా అంటూ ప్రసంగాన్ని ముగించారు.

Leave A Reply

Your email address will not be published.